ధర రూ.6999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, డైనమిక్ బార్ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల..!
భారత్‌లో జనవరి నెలలో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇవాళ రెడ్‌మి 14C 5G విడుదల అయింది. మరిన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రేపు వన్‌ప్లస్ 13 సిరీస్ విడుదల కానుండగా.. ఒప్పో రెనో 13 సిరీస్, మోటో G05, పోకో X7 సిరీస్, రియల్‌మి 14 ప్రో సిరీస్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ ఎంట్రీ లెవర్ ధర సెగ్మెంట్‌లో ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ (Itel A80 Smartphone launched) విడుదల అయింది.
ఈ ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ రూ.7,000 కంటే తక్కువ ధరలో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ డైనమిక్ బార్ ఫీచర్‌ను కలిగి ఉంది. కొనుగోలు చేసిన తొలి 100 రోజుల్లో ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అవకాశం కల్పిస్తున్నట్లు విడుదల సందర్భంగా ఐటెల్ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ పంచ్ హోల్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. డైనమిక్ బార్ ఫీచర్‌ను కలిగి ఉంది. కాల్, బ్యాటరీ స్టేటస్ వంటి వివరాలను పొందవచ్చు.
ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Unisoc T603 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ జతచేసి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ను కలిగి ఉంది. 3 సంవత్సరాలపాటు ల్యాగ్ ప్రీ పనితీరును కనబరుస్తుందని సంస్థ చెబుతోంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీతో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా HDR ను సపోర్టు చేస్తుంది. వెనుక కెమెరా మాడ్యూల్ వద్ద రింగ్ లైట్ యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
3 రోజులపాటు బ్యాటరీ లైఫ్! :
ఈ ఫోన్ 10W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, స్మార్ట్ లింక్ + ఫీచర్‌లను కలిగి ఉంది. ఫలితంగా సింగిల్ ఛార్జింగ్‌తో ఏకంగా 3 రోజులపాటు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని సంస్థ చెబుతోంది.
భారత్ మార్కెట్‌లో ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ఆన్‌లైన్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. ఈ ఫోన్ గ్లేసియర్ వైట్, శాండ్‌స్టోన్ బ్లాక్, వేవ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








