రూ.6499 కే 5000mAh బ్యాటరీ, 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మరియు బడ్జెట్ రేంజ్ ఫోన్ లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఆ కారణంగా అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా కేవలం రూ.6499 ధరకే భారత్ మార్కెట్లో itel A90 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఐటెల్ A80 ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్ గా కొత్త ఫోన్ లాంచ్ అయింది.
ఐటెల్ A90 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (itel A90 Smartphone) 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు డైనమిక్ బార్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.

ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7100 SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత (Go Edition) itel OS 14 పైన పనిచేస్తుంది. రెండు స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ విడుదల కానుంది.
5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఐటెల్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 13MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. మరియు 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ తోపాటు 10W ఛార్జర్ ను అందించనున్నారు.
AI అసిస్టెంట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ AI అసిస్టెంట్ Aivana 2.0 పైన పనిచేస్తుంది. ఈ ఫీచర్ ను అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. డాక్యుమెంట్ ట్రాన్స్‌లేషన్, వాట్సాప్ వాయిస్ మరియు వీడియో కాల్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇమేజ్ గ్యాలరీ కోసం వినియోగించుకోవచ్చు.
భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది.
ఐటెల్ A90 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఐటెల్ A90 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.6499, అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. ఈ ఫోన్ స్టార్‌లిట్ బ్లాక్, స్పేస్ టైటానియం కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ ఫోన్ ప్రస్తుతం రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై 100 రోజుల వరకు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ తోపాటు మూడు నెలల పాటు ఉచితంగా jiosaavn సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








