సరికొత్త టెక్నాలజీతో ధర రూ.9999 కే 50MP కెమెరా, 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే 5G ఫోన్..!
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ నుంచి జనవరి 6 వ తేదీన ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కూడిన ఈ హ్యాండ్‌సెట్ రూ.6999 కే అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మరో ఐటెల్ హ్యాండ్‌సెట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఐటెల్ A95 5G పేరుతో (itel A95 5G Smartphone) లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ సహా ఇతర కీలక వివరాలు లీక్ అయ్యాయి. passionategeekz ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందనే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.
ఐటెల్ A95 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఐటెల్ A95 5G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో విడుదల కానుందని తెలుస్తోంది. మరియు బ్యాక్ ప్యానల్ కలర్ ఛేంజింగ్ టెక్నాలజీను కలిగి ఉంటుంది. IVCD టెక్నాలజీ ఆధారంగా ఇది సాధ్యమయింది.

ఈ 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటి 6300 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉండే అవకాశం ఉంది. అదనంగా 4GB వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనే వీలుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌తో మరో వేరియంట్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంంది. హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP AI కెమెరా సహా మరో కెమెరాను అమర్చి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP కెమెరాతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.9999 గా ఉండే అవకాశం ఉంది.
ఇటీవల భారత్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. కొనుగోలు చేసిన తొలి 100 రోజుల్లో ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అవకాశం ఉంది. ఈ ఫోన్ గ్లేసియర్ వైట్, శాండ్‌స్టోన్ బ్లాక్, వేవ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పంచ్ హోల్ డిజైన్‌తో డైనమిక్ బార్ ఫీచర్‌ను కలిగి ఉంది. 10W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు సేవింగ్ మోడ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.
ఐటెల్ A80 స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Unisoc T603 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరా మాడ్యూల్ వద్ద రింగ్ లైట్ యూనిట్‌ను కలిగి ఉంది.
Image Source : passionategeekz


Click it and Unblock the Notifications








