రూ.7599 ధరకే 5200mAh బ్యాటరీ, 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఫోన్.. సేల్ ప్రారంభం..!
భారత్ మార్కెట్ లో ఎంట్రీ, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లకు డిమాండ్ ఉంటోంది. అందువల్ల అనేక సంస్థలు ఈ ధరల్లో ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే ఐటెల్ సంస్థ ఐటెల్ సిటీ 100 ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7599 గా ఉంది. ఈ ఫోన్ 5200mAh బ్యాటరీ, IP64 రేటింగ్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
ఐటెల్ సిటీ 100 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ డైనమిక్ బార్ 2.0 కూడా సపోర్టు చేస్తుంది. బ్యాటరీ అలెర్ట్స్, ఫేస్ అన్‌లాక్ ప్రాంప్ట్స్, కాల్ నోటిఫికేషన్స్‌ను అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7250 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12GB వరకు ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 13MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఐటెల్ సిటీ 100 ఫోన్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్ డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
ఈ ఫోన్ Aivana 3.0, AI అసిస్టెంట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కలిగి ఉంది. వీటితోపాటు అనేక ఎడిటింగ్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఇందులో AI Writing Suite కూడా ఉంది. Rewrite, Proofread, Summarise వంటి టాస్క్ లను సులభంగా పూర్తి చేయవచ్చు.
సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ సింగిల్ స్పీకర్ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి కనెక్టివిటీని కలిగి ఉంది.
ఐటెల్ సిటీ 100 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఐటెల్ సిటీ 100 స్మార్ట్‌ఫోన్ (itel City 100 Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7599 గా ఉంది. ఐటెల్ సిటీ 100 స్మార్ట్‌ఫోన్‌తో రూ.2999 విలువైన మాగ్నటిక్ స్పీకర్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ఐటెల్ తెలిపింది.
దీంతోపాటు 100 రోజుల్లో ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ ఫెయిరీ పర్పుల్, నేవీ బ్లూ, ప్యూర్ టైటానియం కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. భారత్‌లోని రిటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications