Rs.3,999లకే స్మార్ట్‌ఫోన్‌... దీని ఫీచర్స్ ఇవే....

|

ట్రాన్షన్ ఇండియా ఆధ్వర్యంలోని దాని ఉప బ్రాండ్ అయిన ఐటెల్ ఇప్పుడు ఇండియాలో కొత్తగా బడ్జెట్ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐటెల్ A25 అనే పేరుతో గల ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర 3,999 రూపాయలు. ఇది హెచ్‌డి డిస్‌ప్లే, ఫేస్ అన్‌లాక్ వంటి మరిన్ని ఫీచర్లను అందించే అత్యంత సరసమైన ఫోన్‌లలో ఒకటి. ఈ రోజు నుండి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఐటెల్ A25

ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగు ఎంపికలలో ‘గ్రేడేషన్ బ్లూ', ‘సీ బ్లూ', మరియు పరపుల్ కలర్ ముగింపుతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ యొక్క టాప్ మరియు బాటమ్ మందపాటి బెజెల్స్‌ను కలిగి ఉండి మరియు 5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది.

 

 

బడ్జెట్‌ ధరలో అందుబాటులో గల CPU ఎయిర్ కూలర్‌లుబడ్జెట్‌ ధరలో అందుబాటులో గల CPU ఎయిర్ కూలర్‌లు

ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌

ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌

ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌ 1GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో వస్తుంది. 32GB వరకు మెమొరీని విస్తరించడం కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఎంపిక కూడా ఉంది. ఇది 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

 

 

ఛానెల్‌ల ధరలను పెంచుతున్న స్టార్ ఇండియాఛానెల్‌ల ధరలను పెంచుతున్న స్టార్ ఇండియా

కెమెరా

కెమెరా

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ఫ్లాష్‌తో కూడిన 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ముందువైపు సెల్ఫీల కోసం ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఐటెల్ A25 గూగుల్ లెన్స్‌కు మద్దతు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది.

 

 

వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభంవివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

కనెక్టివిటీ

కనెక్టివిటీ

ఇందులో గల కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ 4G VoLTE/ViLTE, బ్లూటూత్ మరియు వై-ఫై ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కానీ ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మద్దతు మాత్రం లేదు. ఐటెల్ A25 స్మార్ట్‌ఫోన్‌ 3,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది హిందీ మరియు ఇంగ్లీష్ భాషలతో పాటు, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, ఉర్దూ, మలయాళం, నేపాలీ, అస్సామీ మరియు ఒరియా వంటి 12 ప్రాంతీయ భాషలకు కూడా మద్దతును అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Itel Launched New Budget Smartphone in India: Check Price,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X