బడ్జెట్ ధరలో రెండు సెల్ఫీ కింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు

|

చైనా కంపెనీ ఐటెల్ బడ్జెట్ ధరలో మరో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇండియాలోని కస్టమర్లకు అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందించే దిశగా కంపెనీ కృషి చేస్తుందని ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశామని కంపెనీ తెలిపింది. ఐటెల్ ఎస్42, ఎ44 పేరిట ఈ ఫోన్లు విడుదలయ్యాయి. ఐటెల్ ఎ44 రూ.5,799 ధరకు, ఐటెల్ ఎస్42 రూ.8,499 ధరకు లభిస్తున్నాయి.వీటితో పాటు కంపెనీ ఎ44 ప్రొను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమయింది. ఈ ఫోన్ వచ్చే నెలలో వినియోగదారుల వద్దకు రానుంది. కాగా ఈ రెండు ఫోన్లు సెల్ఫీ ఫోకస్ తో మార్కెట్లోకి దూసుకువచ్చాయి. ఆండ్రాయిడ్ నౌగట్ మీద పనిచేసే ఈ ఫోన్లు ఆన్ లైన్ మార్కెట్లలో లభించనున్నాయి.

 

ఓటర్ లిస్టులో పేరును చెక్ చేసుకోవడం ఎలా ?ఓటర్ లిస్టులో పేరును చెక్ చేసుకోవడం ఎలా ?

బడ్జెట్ ధరలో రెండు సెల్ఫీ కింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు

ఐటెల్ ఎస్42 ఫీచర్లు
5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐటెల్ ఎ44 ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 8/16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
itel Mobile launches S42 and A44 smartphones in India at Rs 8,499 and Rs 5,799 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X