Home
Mobile

ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్‌ స్మార్ట్‌ఫోన్‌.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్‌ ఉచితం..!

ఐటెల్‌ నుంచి ఎంట్రీ లెవల్‌ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ ను ఇటీవల విడుదల చేసింది. itel S24 స్మార్ట్‌ఫోన్‌ను (itel S24 Smartphone) 108MP కెమెరాను కలిగి ఉంది. రూ.10,000 ధరకే విడుదల చేసింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక కీలక ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. పూర్తి వివరాలు మీకోసం.

డైనమిక్‌ బార్‌ ఫీచర్‌ :
ఈ ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అయింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డైనమిక్‌ బార్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ముఖ్యమైన నోటిఫికేషన్‌ను ఈ ఫీచర్‌ ద్వారా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

itel S24 smartphone specs and features

ఐటెల్‌ OS 13.5 :
ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G91 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. 16GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఐటెల్‌ OS 13.5 పైన పనిచేస్తుంది. ఈ OS.. సోషల్‌ టర్బో, గేమ్‌ మోడ్‌, డ్యూయల్‌ యాప్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ ఐటెల్‌ S24 హ్యాండ్‌సెట్‌ మెరుగైన సౌండ్‌ క్వాలిటీ కోసం డ్యూయల్ DTS స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు సూర్యకాంతి పడిన సమయంలో యూనిక్‌ లుక్‌ను పొందుతుంది. రెండు కలర్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్టారీ బ్లాక్‌ మరియు డౌన్‌ వైట్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అల్ట్రావైలెట్‌ లైట్‌ ఈ ఫోన్ పై పడినప్పుడు పింక్‌ రంగులో కనిపిస్తుంది.

itel S24 smartphone specs and features

108MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ AI కెమెరాలను కలిగి ఉంటుంది. f1.6 అపేచర్‌తో 108MP మెగాపిక్సల్‌ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) ఫీచర్‌ సపోర్టును కలిగి ఉంటుంది. మరో పోర్ట్రెయిట్‌ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ కొనుగోలుతో స్మార్ట్‌వాచ్‌ ఉచితం :
ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్ ద్వారా కేవలం రూ.9,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుతో ఓ స్మార్ట్‌వాచ్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ నెలాఖరు నాటికి అమెజాన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.

itel S24 smartphone specs and features

స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను రూపొందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటెల్‌ సీఈవో అరిజిత్‌ తలపాత్ర తెలిపారు. దీంతోపాటు తక్కువ ధరలోనే మెరుగైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ల అందించడం మా నిబద్ధతకు నిదర్శనమన్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
itel S24 smartphone launched in india top things to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X