Home
Mobile

108MP కెమెరా, 8GB అంతర్గత స్టోరేజీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..!

ఐటెల్‌ సంస్థ తాజాగా S24 స్మార్ట్‌ఫోన్‌ను (itel S24 Smartphone) ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫొటోక్రోమాటిక్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌ కారణంగా ఫోన్‌ వెనుక ప్యానల్‌ పైన కాంతి ప్రసరించినప్పుడు రంగులు మారుతుంది. దీంతోపాటు 3D మాగ్నటిక్‌తో కూడిన స్టార్రీ డయల్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుంది.

ఐటెల్‌ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1612*720 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 480 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

itel S24 Smartphone unveiled

ఐటెల్‌ S24 హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఐటెల్‌ OS 13 పైన పనిచేస్తుంది. దీంతోపాటు మీడియాటెక్‌ హీలియో G91 SoC చిప్‌ సెట్‌నును కలిగి ఉంటుంది. ఈ చిప్‌ సెట్‌ 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది.

ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.6 అపేచర్‌, 3X జూమింగ్‌తో 108MP శాంసంగ్‌ ISOCELL HM6 కెమెరాను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు QVGA డెప్త్‌ సెన్సార్‌ మరియు LED ఫ్లాష్‌ యూనిట్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. పంచ్‌ హోల్ డిజైన్‌ తో వచ్చింది.

itel S24 Smartphone unveiled

ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ డైనమిక్‌ బార్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా సమీపంలో కనిపిస్తుంది. ముఖ్యమైన నోటిఫికేషన్‌లు, బ్యాటరీ ఛార్జింగ్‌ సహా కాల్స్‌ ఇతర నోటిఫికేషన్లను చూసేందుకు ఉపయోగపడుతుంది. మరియు 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 40 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్‌ పూర్తిచేయవచ్చని పేర్కొంది.

ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్ తాజాగా ఐటెల్‌ గ్లోబల్‌ వెబ్‌సైట్‌లో లిస్టింగ్‌ అయింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఐటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కోస్ట్‌లైన్‌ బ్లూ, డౌన్‌ వైడ్‌, స్టార్రీ బ్లా రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

కనెక్టివిటీ పరంగా ఈ ఐటెల్ S24 స్మార్ట్‌ఫోన్‌ 4G మరియు USB-C సపోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ ధర, సేల్‌ వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఐటెల్‌ S24 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలపై ఇప్పటి వరకు సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
itel S24 Smartphone unveiled with 108MP camera and 8GB RAM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X