Home
Mobile

శాంసంగ్ ప్రీమియం ఫోన్‌ తరహా డిజైన్‌తో మిడ్‌రేంజ్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు లీక్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ itel నుంచి మరో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. Itel S25 అల్ట్రా 4G పేరుతో లాంచ్ కానుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ సంబంధించిన కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌, ధర వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా మాడ్యూల్‌ శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా తరహా డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో విడుదల కానుందని తెలుస్తోంది. భారత్‌ మార్కెట్‌లో మూడు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ (Itel S25 Ultra 4G Smartphone) లభించనుందని సమాచారం.

టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్లాని ఈ ఐటెల్‌ S24 అల్ట్రా 4G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు సహా కీలక వివరాలను లీక్‌ చేశారు. డిజైన్ పరంగా ఈ ఐటెల్‌ S25 అల్ట్రా 4G స్మార్ట్‌ఫోన్‌ ముందువైపు హోల్‌ పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి రానుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

Itel S25 Ultra

Itel S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు! ;
తాజాగా వచ్చిన లీక్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రేష్‌ రేట్‌తో 6.78 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 1400 గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

ఈ S24 అల్ట్రా హ్యాండ్‌సెట్‌ Unisoc T620 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని సమాచారం. అయితే OS వెర్షన్‌ సహా ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది. మరియు ఎన్ని వేరియంట్‌లో అందుబాటులోకి రానుందో వెల్లడి కాలేదు.

కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా సహా మరో రెండు లెన్స్‌లతో లాంచ్‌ కానుంది. ఈ రెండింటి వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా మాడ్యూల్‌ శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా తరహా డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఐటెల్‌ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే లీకైన ఫోటోల ఆధారంగా ఈ ఐటెల్‌ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ IP64 రేటింగ్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 163 గ్రాముల బరువు, 6.9mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ టిప్‌స్టర్ వివరాల ఆధారంగా భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.15,000 గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో లభిస్తుంది. టైటానియం, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుందో వెల్లడి కాలేదు. దీంతోపాటు పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఫొటో క్రెడిట్‌ : X / @passionategeekz

More from GizBot

Best Mobiles in India

English summary
Itel S25 Ultra 4G Smartphone design and specifications leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X