3జిబి ర్యామ్ ఫోన్, మరీ ఇంత తక్కువ ధరలోనా..?

చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ తన సరికొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

By Hazarath
|

చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ తన సరికొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.6990 ధరకే సెల్ఫీప్రొ ఎస్‌42 పేరుతో ఓ మొబైల్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నలుపు, బూడిద రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్‌లో 3జిబి ర్యామ్, 8 ఎంపీ సెల్పీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ఇది వొల్టీ(వీవొఎల్‌టీఈ) 4జీ స్మార్ట్‌ఫోన్‌ అని, వినియోగదాలను అమితంగా ఆకట్టుకుంటుందన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది.ఫీచర్ల విషయానికొస్తే..

పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా..అయితే ఈ యాప్ వాడండి !పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్ కావాలా..అయితే ఈ యాప్ వాడండి !

 డిస్‌ప్లే

డిస్‌ప్లే

5 అంగుళాల HD IPS డిస్‌ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. స్క్రీన్ రిజల్యూషన్ విషయానికొస్తే 1280 x 720 pixels. 1.25GHz quad-core MediaTek processorతో పాటు Mali 720 GPUను కలిగి ఉంది.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీతో పాటు మైక్రో ఎస్ డి ద్వారా 32 జిబి వరకు మెమొరీ సామర్ధ్యాన్ని విస్తరించుకోవచ్చు.

ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా

ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా

ఈ ఫోన్ కి ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా..8 ఎంపీతో వచ్చిన ఈ సెల్పీ కెమెరాకి ఫ్లాష్ లైట్ ఆప్సన్ ఉంది. దీంతో సెల్ఫీ అభిమానులు తమకు నచ్చిన ఫోటోలు షూట్ చేసుకోవచ్చు. 0.1 సెకండ్ లో సెల్ఫీని షూట్ చేయవచ్చు. అలాగే 8 ఎంపీ బ్యాక్ కెమెరా ఉంది.

ఆండ్రాయిట్ నౌగట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఆండ్రాయిట్ నౌగట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఆండ్రాయిట్ నౌగట్ మీద రన్ అయ్యే ఈ ఫోన్ 4జీ వోల్ట్ కి సపోర్ట్ చేస్తుంది. WiFi, Bluetooth, GPS and micro USB పోర్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ. రికార్డ్ కాల్స్ కి ఆన్సర్ ఇచ్చే ఆప్సన్ కూడా ఉంది. 5 ఢిఫరెంట్ అప్లికేషన్లతో ఈ ఫోన్ వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఎంపికచేసిన స్టోర్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది.

Best Mobiles in India

English summary
Itel Selfiepro S41 with 8-megapixel front camera, 3GB RAM launched in India Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X