రూ.5999 కే 5000mAh బ్యాటరీ, 6.6 HD+ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ వాయిస్ అసిస్టెంట్‌తో స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంటోంది. అందువల్ల స్మా్ర్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఈ ధరలో అనేక మోడల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఐటెల్ జీనో 20 స్మార్ట్‌ఫోన్ ను (itel Zeno 20 Smartphone) లాంచ్ చేసింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయింది. ఐటెల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఐటెల్ జీనో 20 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డైనమిక్ బార్ ఫీచర్ ను కలిగి ఉంది. దీని ద్వారా కాల్ అలెర్ట్స్, బ్యాటరీ ఛార్జింగ్ నోటిఫికేషన్ లను పొందవచ్చు.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7100 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 గో OS పైన పనిచేస్తుంది.
13MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ధరలో మంచి బ్యాటరీ గానే భావించవచ్చు.
ఇన్‌బిల్ట్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ :
ఐటెల్ ఫోన్ Aivana 2.0 ఇన్‌బిల్ట్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంది. ఈ వాయిస్ అసిస్టెంట్ ద్వారా అనేక యాప్స్ ను సులభంగా ఓపెన్ చేయడం సహా వినియోగించుకోవచ్చు. వాయిస్ కమాండ్ ద్వారా సెట్సింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చు. ఈ వాయిస్ అసిస్టెంట్ హిందీ భాషను సపోర్టు చేస్తుంది.
DTS సౌండ్ :
సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. DTS సౌండ్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఐటెల్ జీనో 20 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.5999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,899 గా ఉంది. ఈ ఫోన్ సేల్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది.
ఐటెల్ జీనో 20 స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్ లో భాగంగా 3GB వేరియంట్ పై రూ.250, 4GB వేరియంట్ పై రూ.300 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆరోరా బ్లూ, స్పేస్ టైటానియం, స్టార్‌లిట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








