'విండోస్ 8 ఓఎస్' తో 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2'...

Posted By: Staff

'విండోస్ 8 ఓఎస్' తో 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2'...

ఐటిజి కంపెనీ గతంలో 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్'ని విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. మార్కెట్లో 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్' మొబైల్ మంచి సక్సెస్‌ని సాధించడంతో మైక్రోసాప్ట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మరో కొత్త ఫోన్‌ 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొదటసారి విడుదల చేసిన 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్' మొబైల్‌తో పోల్చితే ఇప్పడు విడుదల చేస్తున్న 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2'లో కొత్త ఫీచర్స్‌ని ఇమడింప జేయడమే కాకుండా, మంచి స్టయిలిష్ లుక్‌తో రూపొందించారు. ప్రక్క చిత్రంలో ఉన్న పోటోని చూస్తే మీకు ఈ విషయం అర్దం అవుతుంది.

'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2' ప్రత్యేకతలను గమనించినట్లేతే మొబైల్ చుట్టుకొలతలు 140 mm x 73 mm x 17.5 mm. చూడడానికి పెద్ద సైజుగా కనిపిస్తున్నప్పటికీ జేబులో సులువుగా సరిపోతుంది. బరువు 400 గ్రాములు. మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8 అప్‌డేట్ వర్సన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ కోసం కస్టమర్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను, ఇందులో 1.6GHz Atom Z530 ప్రాసెసర్‌తో పాటు, 2 GB RAMని నిక్షిప్తం చేయడం జరిగింది.

'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2' మొబైల్‌లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 112జిబి వరకు విస్తరించుకొవచ్చు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4.3 ఇంచ్ గా రూపొందించబడింది. బ్యాటరీ బ్యాక్‌అప్ విషయానికి వస్తే 18 గంటలు పాటు కాల్ టైమ్ వస్తుండగా, 46 గంటలు పాటు స్టాండ్ బై టైమ్‌గా వస్తుందని పలువురు టెక్నాలజీ బ్లాగులు ప్రస్తావించారు.

'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2' మొబైల్‌ ఫోన్‌ని వచ్చే సంవత్సరం జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి దీని ధరను కూడా మార్కెట్లో వెల్లడంచలేదు. త్వరలో 'ఐటిజి ఎక్స్‌పి ఫోన్ 2' మొబైల్‌‌కి సంబంధించిన పూర్తి సమాచారం వన్ ఇండియా పాఠకులకు అందివ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot