అదే జరిగితే ‘ఇంటెల్’ పరిస్థితి ఏంటి..?

Posted By: Prashanth

అదే జరిగితే ‘ఇంటెల్’ పరిస్థితి ఏంటి..?

 

ప్రాసెసర్‌ల ఉత్పాదక సంస్థ ‘ఇంటెల్’ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పట్టు బిగించిందా..?, పోటీ బ్రాండ్‌లను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న వ్యూహాలేంటి..?,

శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ఇంటెల్ సన్నహాలు చేస్తుంది. వేగవంతమైన ప్రాసెసర్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘మెడ్‌ఫీల్డ్ ఫ్లాట్‌ఫామ్’ను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్‌లు మార్కెట్లోకి వస్తే ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తీవ్రమైన పోటీని ఎదుర్కొవల్సి వస్తుంది.

పూర్తి స్ధాయి డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టంను మొబైల్ ఫోన్‌లో ప్రవేశపెట్టేందుకు ఇన్ టెక్నాలజీ గ్రూప్ లిమిటెడ్ (ఐటీజీ) కసరత్తులు చేస్తుంది. ఈ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన Xp ఫోన్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా Xp ఫోన్ 2 రూపుదిద్దుకుంది. ఇటీవల చైనా మార్కెట్లో విడుదలైన ‘ఎక్స్‌పీ 2’ అక్కడి మీడియా దృష్టిని ఆకర్షించింది. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్న ఈ డివైజ్ త్వరలో విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ కానుంది. ఐఫోన్ 4ఎస్‌కు పోటీగా Xp2ను విడుదల చేసినట్లు సమాచారం.

ఐటీజీ ‘ఎక్స్‌పీ ఫోన్ 2’ కీలక ఫీచర్లు:

* స్లైడర్ డిజైన్, * సింగిల్ కోర్ ఆటమ్ Z530 ప్రాసెసర్, * క్లాక్ వేగం 1.6 GHz,* 2జీబి ర్యామ్, * 112జీబి ఎస్ఎస్‌డి మెమరీ, * వీజీఏ పోర్ట్, * క్వర్టీ కీప్యాడ్, * డిస్‌ప్లే 4.3 అంగుళాలు, ధర ఇతర పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot