ఇక GPS తప్పనిసరి, భారీగా పెరగనున్న మొబైల్ ఫోన్‌ల ధరలు

సెక్యూరిటీ పరంగా జీపీఎస్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

|

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2018 నుంచి విక్రయించే ప్రతి ఫోన్‌లో జీపీఎస్ (గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీ ఉండితీరాలని మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలను కోరింది.

ఎమర్జెన్సీ పరస్థితుల్లో ఉపయోగపడుతుంది

ఎమర్జెన్సీ పరస్థితుల్లో ఉపయోగపడుతుంది

సెక్యూరిటీ పరంగా జీపీఎస్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరస్థితుల్లో వినియోగదారుల ఆచూకీని ఈ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసే వీలుంటుంది.

ఫోన్‌ల ధరలు 50% వరకు పెరగే అవకాశం

ఫోన్‌ల ధరలు 50% వరకు పెరగే అవకాశం

ఈ టెక్నాలజీ చాలా ఖరీదుతో కూడుకుని ఉండటంతో జీపీఎస్ సౌకర్యంతో వచ్చే బేసిక్ ఫోన్‌ల ధరలు 50% వరకు పెరగే అవకాశముందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. అంటే ఇప్పుడు రూ.1000 పెట్టి కొనుగోలు చేస్తున్న ఫోన్ ధర అప్పుడు రూ.1500 వరకు పెరగొచ్చన్న మాట.

జీపీఎస్ టెక్నాలజీనికి ఏ-జీపీఎస్ టెక్నాలజీ...

జీపీఎస్ టెక్నాలజీనికి ఏ-జీపీఎస్ టెక్నాలజీ...

ఫీచర్ ఫోన్‌లలో జీపీఎస్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయాలంటే హై-కాన్ఫిగరేషన్ అవసరమవుతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్, టెలికాం శాఖను కోరినప్పటికి ఫలితం లేకుండాపోయింది.

 స్పష్టమైన లొకేషన్‌ను కనుగొనలేం...

స్పష్టమైన లొకేషన్‌ను కనుగొనలేం...

ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించటం వల్ల ఫోన్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది. అయితే, ఆ ఫోన్ ఎక్కడుందీ అనే స్పష్టమైన లొకేషన్‌ను మాత్రం ట్రేస్ చేయటం కుదరదు.

మెటీరియల్ ఆఫ్ కాస్ట్  రూ.700కు పెరిగిపోతుంది...

మెటీరియల్ ఆఫ్ కాస్ట్ రూ.700కు పెరిగిపోతుంది...

ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ గతేడాది ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం రూ.500 నుంచి రూ.700 మధ్య విక్రయిస్తోన్న ఫీచర్ ఫోన్స్ తయారీకి రూ.330 వరకు ఖర్చవుతోంది. ఇప్పుడు ఈ ఫోన్‌లలో జీపీఎస్‌ను ఇన్‌స్టాల్ చేయటం వల్ల రూ.700 వరకు మెటీరియల్ ఆఫ్ కాస్ట్ పెరుగుతుందని ఐసీఏ చెబుతోంది.

ముఖ్యమైన ఫీచర్లలో జీపీఎస్ ఒకటి..

ముఖ్యమైన ఫీచర్లలో జీపీఎస్ ఒకటి..

నేటితరం స్మార్ట్‌ఫోన్‌లలో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్లలో జీపీఎస్ ఒకటి. శాటిలైట్ ఆధారంగా స్పందించే ఈ నావిగేషన్ వ్యవస్థ పూర్తి పేరు గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం (Global Positioning System).

ఎక్కడికైనా సలువుగా వెళ్లిపోవచ్చు...

ఎక్కడికైనా సలువుగా వెళ్లిపోవచ్చు...

జీపీఎస్ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే చాలు దారి తెలియకపోయినా ఎక్కడికైనా సలువుగా వెళ్లిపోవచ్చు. జీపీఎస్ ఫీచర్, మ్యాపింగ్ ద్వారా మనం చేరుకోవల్సిన గమ్యాన్ని మలుపులతో సహా చూపిస్తుంది. జీపీఎస్ సిస్టంను 24 ఉపగ్రహాల సహకారంతో అమెరికా అభివృద్థి చేసింది. ఈ ఉపగ్రహాలు భూమిని మొత్తం కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేస్తుంటాయి.

జీపీఎస్ పనితీరు మెరుగుపడాలంటే..

జీపీఎస్ పనితీరు మెరుగుపడాలంటే..

కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో జీపీఎస్ ఫీచర్ ఫేలవమైన పనితీరును కనబరుస్తుంటుంది. ఈ సమస్యకు ఫోన్ హార్డ్‌వేర్ ప్రధాన కారణం కావొచ్చు. మీ స్మార్ట్‌‍ఫోన్‌లలో జీపీఎస్ పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

High Accuracy మోడ్‌ను ఎనేబుల్ చేసుకోండి...

High Accuracy మోడ్‌ను ఎనేబుల్ చేసుకోండి...

ఫోన్ సెట్టింగ్స్‌లోని High Accuracy మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.

యాక్టివేట్ చేసుకోవాలంటే..?

యాక్టివేట్ చేసుకోవాలంటే..?

High Accuracy మోడ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తరువాత లోకేషన్ సర్వీసును టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ కనిపించే Location Sources categoryలో High Accuracy మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ సిగ్నల్ సామర్థ్యం మరింత రెట్టింపు అవుతుంది.

అప్పటికి అలానే ఉంటే...

అప్పటికి అలానే ఉంటే...

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న GPS Essentials యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు. GPS Essential యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత కూడా జీపీఎస్ సిగ్నల మందకొడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌లో హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నట్లే.

Best Mobiles in India

English summary
It's mandatory to install Global Positioning System (GPS) in all mobile phones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X