ఆపిల్ కొత్త ఐప్యాడ్ పేరు ఐప్యాడ్ 3 కాదా...?

Posted By: Staff

ఆపిల్ కొత్త ఐప్యాడ్ పేరు ఐప్యాడ్ 3 కాదా...?

 

గత కొన్ని రోజులుగా యూజర్స్ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న ఆపిల్ తర్వాతి జనరేషన్ ఐప్యాడ్ నిన్న(మార్చి 7)వ తారీఖున శాన్ ప్రాన్సికోలో అంగరంగ వైభవంగా ఆపిల్ ఛైర్మన్ టిమ్ కుక్ చేతుల మీదగా విడుదలైంది. ఆపిల్ కొత్తగా విడుదల చేసిన ఈ ఆపిల్ ఐప్యాడ్‌లో రెటీనా డిస్ ప్లే ప్రత్యేకం. దీని డిస్ ప్లే రిజల్యూషన్ 2048 x 1536 పిక్సల్స్. క్వాడ్ కోర్ గ్రాఫిక్స్‌ని కలిగి ఉండడంతో పాటు A5X ఛిప్‌ని నిక్షప్తం చేశారు. ఆపిల్ కొత్తగా విడుదల చేసిన దీని పేరుని ఆపిల్ ఐప్యాడ్ 3, ఐప్యాడ్ హెచ్‌డిగా నామకరణం చేస్తారని భావించినప్పటికీ ఆపిల్ మాత్రం 'న్యూ ఆపిడ్'గా నామకరణం చేసింది.

'న్యూ ఐప్యాడ్' టాబ్లెట్‌లో 5 MP iSight కెమెరాతో పాటు హై క్వాలిటీ ఇమేజిలను తీయగలిదే సత్తా ఉంది. వీడియోలను ఐతే 1080p HD ఫార్మెట్లో రికార్డ్ చేస్తుంది. ఇంకా 'న్యూ ఐప్యాడ్' ప్రత్యేకతలు  ఏమిటంటే ఇందులో ఎల్‌టిఈ ఫెసిలిటీని కలిగి ఉంది. దీనితో పాటు ఆపిల్ కొత్త ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 5.1ని ఇందులో నిక్షిప్తం చేశారు. ఆపిల్ కొత్తగా రూపొందించిన 'న్యూ ఐప్యాడ్' మార్కెట్లో రెండు మోడల్స్‌లో లభ్యమవుతుంది అది ఒకటి Wi-Fi రెండవది Wi-Fi + 4G.

ఐప్యాడ్ Wi-Fi నలుపు, తెలుపు రంగులలో మార్చి 16 శుక్రవారం నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 16 GB, 32 GB, 64 GB మెమరీలతో లభించే ఈ మోడల్స్ ఖరీదు వరుసగా $499, $599, $699 ఉన్నాయి. అదే ఐప్యాడ్ Wi-Fi + 4G విషయానికి వస్తే వెరిజోన్, ఏటి అండ్ టి ద్వారా 16 GB, 32 GB, 64 GB మెమరీలతో లభించే ఈ మోడల్స్ ఖరీదు వరుసగా $629, $729, $829  ఉన్నాయి.

'న్యూ ఐప్యాడ్' అమ్మకాలు లండన్, అమెరికా వర్జిన్ ఇస్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, ప్యూర్టో రికో, జపాన్, హాంగ్ కాంగ్, జెర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా మరియు అమెరికాలలో లభ్యమవుతుంది. గతంలో ఆపిల్ విడుదల ఐప్యాడ్‌లతో పోల్చి చూస్తే న్యూ ఐప్యాడ్ టెక్నాలజీ పరంగా, నూతన ఫీచర్స్‌ని జత చేయడం జరిగింది. కెమెరా అప్లికేషన్‌తో పాటు వీడియో స్టబిలైజేషన్ టెక్నాలజీ ఇందులో అత్యంత అద్బుతం అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot