ఇండియాకు మరో చైనా కంపెనీ, రూ.3,999కే 4G-VoLTE ఫోన్

మరో చైనా కంపెనీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటైన iVOOMi, ఇండియన్ మార్కెట్లో చౌక ధర 4G-VoLTE స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. iV505 పేరుతో తన మొదటి స్మార్ట్ ఫోన్ ను మరికొ‌ద్ది రోజుల్లో ఈ బ్రాండ్ లాంచ్ చేయబోతోంది.

ఇండియాకు మరో చైనా కంపెనీ, రూ.3,999కే 4G-VoLTE ఫోన్

Read More : రోజుకు 100 కోట్ల గంటలు, యూట్యూబ్‌కే అంకితం

ఈ ఫోన్ ధర రూ.3,999గా ఉంటుందట. డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రముఖ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండబోతున్నాయి. రూ.4,000 నుంచి రూ.10,000 బడ్జెట్ రేంజ్‌లో నాలుగు 4G-VoLTE స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు iVOOMi సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి భారత్ లో తయారీ యూనిట్ ను కూడా నెలకొల్పేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా ఫోన్‌ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది. తక్కువ ధరల్లో ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఫోన్‌లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో హల్‌చల్ చేస్తోన్న చాలా వరకు అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లు తక్కవ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మనకు అంటగడుతున్నాయి.

నాసిరకమైన మెటీరియల్ డిజైనింగ్‌తో

అంటగడుతున్నాయి. మేడి పండు మాదిరిగా పైకి నిగనిగలాడుతూ కనిపించే ఈ ఫోన్‌లు నాసిరకమైన మెటీరియల్ డిజైనింగ్‌తో వాడుతున్న కొద్ది చుక్కలు చూపిస్తాయి. అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో తీసుకోవల్సిన 10 జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం.

నెట్‌వర్క్‌ సమస్యలు..

బ్లాక్ మార్కెట్లో దొరుకుతోన్న చాలా వరకు అన్ బ్రాండెడ్ చైనా ఫోన్‌లు వాళ్ల రీజియన్‌లోని నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఉదాహరణకు TD-SCDMA నెట్‌వర్క్ ఈ 3జీ WCDMA స్టాండర్డ్ నెట్‌వర్క్ కేవలం చైనాలోనే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోలే చైనా ఫోన్ మన స్థానిక్ నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేసేవిగా ఉండాలి.

పనచేయని పవర్ సాకెట్స్

చైనా పవర్ ప్లగ్స్ కొన్ని సందర్భాల్లో చైనా ఫోన్‌లతో పాటు వచ్చే పవర్ సాకెట్స్ ఇక్కడ పని చేయవు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

ఇయర్ ఫోన్స్ ఉండవు..

తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు ఖర్చులను మరింతగా తగ్గించుకునే కమ్రంలో ఇయర్ ఫోన్‌లను ఇవ్వటం లేదు.

స్టోరేజ్ సమస్యలు..

తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు తమ ఫోన్‌‌లో ఇంటర్నల్ మెమరీ స్పేస్‌ను మరింతగా తగ్గించివేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 8జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.

నాసిరకమైన కెమెరా క్వాలిటీ

చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లు నాసిరకమైన కెమెరా క్వాలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

నాసిరకమైన గ్లాస్..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తాము ఆఫర్ చేస్తోన్న ఫోన్‌ల పై రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, అన్ బ్రాండెడ్ చైనా ఫోన్‌లలో ఈ విధమైన సదుపాయం ఉండదు. ఇవి ఏ మాత్రం కిందపడినా ఎందుకు పనికిరాకుండా పోతాయి.

టచ్ క్వాలిటీ బాగోదు..

తక్కువ క్వాలిటీతో డిజైన్ కాబడే చైనా ఫోన్‌లలో టచ్ రికగ్నిషన్ వ్యవస్థ నాసిరకంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు..

 అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు. ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు

అన్ బ్రాండెడ్ చైనా ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు. లాంగ్వేజ్ సపోర్ట్ వాస్తవానికి అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లలో లాంగ్వేజ్ సపోర్ట్ కూడా నాసిరకంగానే ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడ తయారవుతాయి కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China's iVOOMi readies for India foray with four budget smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot