iVoomi i1 మొదటి ఇంప్రెషన్స్, రూ.5,999 బడ్జెట్‌లో నమ్మదగ్గ స్మార్ట్‌ఫోన్

|

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇందుకు కారణం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల తరహాలోనే వీటిలో కూడా హై-ఎండ్ ఫీచర్‌లను పొందుపరచటమే. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ వంటి హై-రేంజ్ ఫీచర్లు సైతం బడ్జెట్ రేంజ్ ఫోన్‌లలో దర్శనమిస్తున్నాయి.

 
iVoomi i1 మొదటి ఇంప్రెషన్స్, రూ.5,999 బడ్జెట్‌లో నమ్మదగ్గ స్మార్ట్‌ఫోన

సరిగ్గా ఇలాంటి అప్‌డేటెడ్ ఫీచర్లతోనే చైనా ఫోన్‌ల కంపెనీ ఐవూమీ.. iVoomi i1, iVoomi i1S మోడల్స్‌లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిని ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. iVoomi i1 ధర రూ.5,999గాను, iVoomi i1S ధర రూ.7,499గాను ఉంది. వీటికి సంబంధించి మొదటి ఇంప్రెషన్స్‌ను పరిశీలించినట్లయితే...

పాలీకార్బోనేట్ బాడీతో స్టర్డీ ఫీలింగ్..

పాలీకార్బోనేట్ బాడీతో స్టర్డీ ఫీలింగ్..

పాలీకార్బోనేట్ బాడీలతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు చక్కటి ధృఢ నిర్మాణాన్ని కలిగి కంఫర్టబుల్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తున్నాయి. నిగనిగలాడే రేర్ ప్యాన్‌ల్ ఫినిషింగ్ ఫోన్‌కు మరింత ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది.

ఇదే బడ్జెట్‌లో లభ్యమవుతోన్న Infocus Vision 3 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే iVoomi i1 మోడల్ మరింత బల్కీగా అనిపిస్తోంది. బటన్స్ ఫిట్టింగ్ విషయానికి వచ్చేసరికి ఫోన్ కుడిచేతి వైపు భాగంలో వాల్యుమ్ రాకర్స్‌తో పాటు పవర్‌బటన్, బోటమ్ ఎడ్జ్‌లో మైక్రోఫోన్ అలానే స్పీకర్ యూనిట్, టాప్ ఎడ్జ్ భాగంలో 3.5ఎమ్ ఆడియో జాక్ పోర్టుతో ఛార్జింగ్ పోర్టులను iVoomi నిక్షిప్తం చేసింది.

18:9 యస్పెక్ట్ రేషియో స్ర్కీన్

18:9 యస్పెక్ట్ రేషియో స్ర్కీన్

iVoomi i1 స్మార్ట్‌ఫోన్‌కు 18:9 యస్పెక్ట్ రేషియో స్ర్కీన్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5.45 అంగుళాల పుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే బెస్ట్ క్వాలిటీ విజువల్స్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. వ్యూవింగ్ యాంగిల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సన్‌లైట్‌లోనూ స్ర్కీన్ డిస్‌ప్లే ప్రకాశవంతంగా కనిపిస్తోంది.

డ్యుయల్ - లెన్స్ కెమెరా సెటప్..
 

డ్యుయల్ - లెన్స్ కెమెరా సెటప్..

iVoomi i1 స్మార్ట్‌ఫోన్‌కు డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించి వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ లోతైన bokeh ఎఫెక్ట్స్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ కెమెరా యూనిట్ అందిస్తోన్న ఫైనల్ ఇమేజ్ అవుట్‌పుట్ క్వాలిటీ పరంగా యావరేజ్ రిజల్ట్స్‌ను మాత్రమే ఆఫర్ చేయగలుగుతుంది. ఫోన్ ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో షార్ప్‌నెస్ లోపించినప్పటికి కాంట్రాస్ట్ లెవల్స్ మాత్రం మెండుగా ఉన్నాయి.

ఏపీ, తెలంగాణలో Airtel అందిస్తున్న మొత్తం డేటా ప్లాన్లు, రూ.9 నుంచి రూ.3999 దాకా..ఏపీ, తెలంగాణలో Airtel అందిస్తున్న మొత్తం డేటా ప్లాన్లు, రూ.9 నుంచి రూ.3999 దాకా..

క్వాడ్-కోర్ సీపీయూ, 2జీబి ర్యామ్, స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

క్వాడ్-కోర్ సీపీయూ, 2జీబి ర్యామ్, స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి iVoomi i1, మీడియాటెక్ 6737 క్వాడ్-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌తో అనుసంధానించిన మాలీ-టీ720 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది.

2జీబి ర్యామ్‌తో పాటు 16జీబి ఇంటర్నెట్ స్టోరేజ్ వ్యవస్థలు ఈ డివైస్‌లో పొందుపరచబడ్డాయి. iVoomi లాంచ్ చేసి మరో మోడల్ iVoomi i1Sలో 3జీబి ర్యామ్‌తో పాటు 32జీబి ఇంటర్నెట్ స్టోరేజ్‌లను పొందుపరచటం జరిగింది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్టోరేజ్ సామర్థ్యాలను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. దాదాపుగా స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఈ ఫోన్ బూట్ అవుతుంది.

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ

iVoomi i1 స్మార్ట్‌ఫోన్‌ 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఫుల్ చార్జ్‌తో రోజంతా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చు. ఇక కనెక్టువిటీ ఫీచర్ల విషయానికి వచ్చేసరికి 4G VoLTE, బ్లుటూత్, వై-ఫై, డ్యుయల్ సిమ్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ స్పెక్స్ ఈ డివైస్‌లో ఇనిబిల్ట్ చేయబడ్డాయి.

చివరి మాటలు..

చివరి మాటలు..

రూ.5,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న iVoomi i1 స్మార్ట్‌ఫోన్‌‌ను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ డివైస్‌లోని 18:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్, డ్యుయల్-లెన్స్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి పూర్తి న్యాయం చేసేలా ఉన్నాయి. ఈ ఫోన్‌ల పనితీరుకు సంబంధించిన పూర్తి విశ్లేషణను త్వరలోనే రివ్యూ రూపంలో మీకందించటం జరుగుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
iVoomi i1 First Impressions. The budget smartphone is priced t Rs. 5,999 and offer 18:9 aspect ratio displays and dual-lens camera setup. It will exclusively sell on Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X