రేపటి తరం నాయకుడు

Posted By: Super

రేపటి తరం నాయకుడు

 

జేసీబీ (JCB)సంస్థ అనగానే తొలత గుర్తుకు వచ్చేది హెవీ ట్రక్కులతో పాటు భారీ ఎక్స్కవేటర్లు. భారీ రవాణా యంత్రాలను రూపొందించే ఈ సంస్థ

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇటీవల మోటరోలాతో జతకట్టి  Defy+ పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను వెలుగులోకి తెచ్చింది.

తరువాతి వెంచర్‌గా జేసీబీ టఫ్‌ఫోన్‌ల తయారీ పై ద్ళష్టిసారించింది. చైనాకు చెందిన ఓ ప్రముఖ తయారీ సంస్ధతో జేసీబీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. టఫ్‌ఫోన్ సైట్ మాస్టర్ 2, టఫ్‌ఫోన్ సైట్ మాస్టర్ 3జీ, జేసీబీ ప్రో స్మార్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్‌ల ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

సైట్ మాస్టర్ 2:

ఐపీ67 సర్టిఫికేషన్ పొందిన ఈ క్యాండీ బార్ ఫోన్ జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. రగ్గుడ్ స్టైల్‌తో డిజైన్ కాబడిన ఈ ఫోన్‌లు సురక్షితమైన రబ్బర్ గ్రిప్‌లతో కప్పబడి ఉంటాయి. ఈ సౌలభ్యతతో  ఫోన్‌కు ఎటువంటి ప్రమాదం పొంచి ఉండదు. నిక్షిప్తం చేసిన 2 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ఎల్లో, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో  ఈ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది.

సైట్ మాస్టర్ 3జీ:

జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ క్యాండీబార్ ఫోన్ అదనంగా 3జీ కనెక్టువిటీని కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ కెమెరా క్వాలిటీ చిత్రాలను బంధిస్తుంది. ఫోన్‌ శరీరాన్ని పూర్తి స్ధాయిలో కప్పి ఉంచిని రబ్బర్ గ్రిప్స్ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తాయి.

జేసీబీ టఫ్ మాస్ట్రర్ ప్రో:

పై రెండు ఫోన్‌లతో పోల్చుకుంటే ఈ హ్యాండ్ సెట్ కాస్తంత భిన్నం 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే మన్నికైన విజువల్స్‌ను విడుదల చేస్తుంది. ఐపీ67 సర్టఫికేషన్ పొందిన ఈ డివైజ్ ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. ప్రాసెసర్ సామర్ధ్యం 800 మెగాహెడ్జ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot