సంచలనం రేపుతోన్న 3 అంగుళాల 4జీ స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన Unihertz అనే కంపెనీ Jelly పేరుతో ప్రపంచపు అతిచిన్న స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కేవలం 2.45 అంగుళాలు మాత్రమే ఉంటుంది. చుట్టుకొలత 92.3 x 43 x 13.3మిల్లీమీటర్లు.

Read More : ఈ ఫోన్ ధర రూ.5,999, సంవత్సరంలోపు రిపేర్ వస్తే కొత్తది ఇచ్చేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్న సైజు స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వారి కోసం..

చిన్న సైజు స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు Unihertz కంపెనీ చెబుతోంది. జెల్లీ, జెల్లీ ప్రో పేర్లతో రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

చిన్న డిస్‌ప్లే..

జెల్లీ, జెల్లీ ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 2.45 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్‌లను కలిగి ఉంటాయి. రిసల్యూషన్ సామర్థ్యం 240 x 432పిక్సల్స్. ఆండ్రాయిడ్  నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్‌లు స్పందిస్తాయి.

క్వాడ్-కోర్ సాక్ పై రన్ అవుతాయి..

ఈ స్మార్ట్‌ఫోన్‌లు 1.1గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతాయి. లోపల వినియోగించిన చిప్‌సెట్ గురించి తెలియాల్సి ఉంది. 950mAh బ్యాటరీలతో ఇవి ఫిట్ అయి ఉంటాయి.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

జెల్లీ వేరియంట్ ఫోన్ 1జీబి ర్యామ్ అలానే 8జీబి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో జెల్లీ ప్రో మోడల్ ఫోన్ 2జీబి ర్యామ్ అలానే 16జీబి స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

ధర ఇంకా అందుబాటు

మార్కెట్లో జెల్లీ ఫోన్ ధర 59 డాలర్ల వరకు ఉండొచ్చని సమాచారం. మన కరెన్సీలో ఈ విలువ రూ.3,700. ఈ ఫోన్‌లకు సంబంధించిన అమ్మకాలు ఆగష్టు నుంచి ప్రారంభమవుతాయి. స్కై బ్లు, స్పే స్ బ్లాక్ ఇంకా Pearl White వేరియంట్లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meet Jelly, the smallest 4G smartphone with Android Nougat. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting