వాళ్లిద్దరి మధ్య ‘ఎఫైర్’!

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం అప్ డేట్ విషయంలో చిప్ మేకర్ ఇంటెల్, సెర్చ్ ఇంజన్ గుగూల్ మధ్య చర్చలు సాగినట్లు మార్కెట్ వర్గాల టాక్. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను పొందుపరిచే అంశమే వీటి మధ్య చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇంటెల్ తొలి స్మార్ట్ ఫోన్ ‘లావా జోలో ఎక్స్900’ 2012 ఆరంభంలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటెల్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్‌కు సంబంధించి ఏవిధమైన అధికారిక సమాచారం లేదు. స్మార్ట్‌ఫోన్‌ల పరిశ్రమలోకి ఆలస్యంగా అడుగుపెట్టిన ఇంటెల్ ఆ విభాగంలో ఆది నుంచి రాణిస్తున్న ఎన్-విడియా, క్వాల్కమ్, సామ్‌సంగ్, టెక్నాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి ప్రముఖ చిప్ తయారీ సంస్థల నుంచి పోటీను ఎదుర్కొంటుంది.
ఇంటెల్ ప్రాసెసర్ ఆధారితంగా పని చేసే ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ను లావా ప్రవేశపెట్టింది. లావా, ఇంటెల్ సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ పేరు ‘XOLO X900’. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు..
* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,
* ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),
* ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,
* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,
* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,
* హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,
* ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.


Click it and Unblock the Notifications







