ఎల్‌జీ సహాకారంతో 'జిల్ సాండర్స్' విండోస్ స్మార్ట్ ఫోన్..

By Super
|
LG Gil Sander
జర్మన్ ఫ్యాషన్ తయారీదారైన జిల్ సాండర్స్ ఒక అడుగు ముందుకేసి ఇప్పడు స్మార్ట్ ఫోన్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టి పెట్టగానే ప్రపంచంలో కెల్లా అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్‌ని డిజిటల్ ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ భాగస్వామ్యంతో రూపొందించింది. మాకు అందిన వివరాల ప్రకారం ఈరోజు(అక్టోబర్ 7)న జిల్ సాండర్స్ రూపొందించిన అత్యుత్తమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్న రోజు. 'ఎల్‌జీ జిల్ సాండర్స్' పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఎల్‌జీ జిల్ సాండర్స్ స్మార్ట్ ఫోన్ విండోస్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసేటటువంటి స్మార్ట్ ఫోన్.

ఇది మాత్రమే కాదండోయ్ హై ఫెర్పామెన్స్‌ని డెలివరీ చేసేందుకు గాను ఈ స్మార్ట్ ఫోన్‌లో 1 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. జిల్ సాండర్స్ అప్లికేషన్స్‌తో పాటు ఈ మొబైల్‌లో అద్బుతమైన ఫ్యాషన్ కలెక్షన్స్‌ని పొందుపరచడం జరిగిందని వినడం జరిగింది. ఈ అప్లికేషన్స్‌తో ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాల ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం మీ ముందు ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మీకు లభించిన ఈ ఫ్యాషన్ టెక్నాలజీ సమాచారం మొత్తం సోషల్ మీడియా ద్వారా మీ స్నేహితులకు, సన్నిహితులకు షేర్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది.

ఎల్‌జీ జిల్ సాండర్స్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్‌ని ఎల్‌జీ ఈ900గా కూడా సంభోదిస్తున్నారు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను డిస్ ప్లే సైజు 3.8 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది. మల్టీ టచ్ ఫెసిలిటీతో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 480 x 800 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. ఎల్‌జీ జిల్ సాండర్స్ స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన అమర్చిన 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో హై రిజల్యూషన్ ఇమేజిలను తీయవచ్చు. దీనితో పాటు హై డెపినేషన్ వీడియోని కూడా తీయవచ్చు.

ఎల్‌జీ అధారిటీస్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎల్‌జీ మొబైల్ సిరిస్‌లలో బాగా సక్సెస్ సాధించిన ఆప్టిమస్ సిరిస్‌లో ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అవన్ని ఫీచర్స్‌ని కూడా ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్‌జీ జిల్ సాండర్స్ మొబైల్‌కి పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని కూడా సెట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎల్‌జీ జిల్ సాండర్స్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం జర్ననీ, ఇటలీ, యుకె లలో లభ్యమవుతుండగా, త్వరలో ప్రాన్స్, ఆస్ట్రేలియాలో విడుదల చేయనున్నారు. ఇంత అంగరంగ వైభవంగా విడుదలవుతున్న ఎల్‌జీ జిల్ సాండర్స్ స్మార్ట్ ఫోన్ ధరని ఇంకా మార్కెట్లోకి వెల్లడించ లేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X