Home
Mobile

జియో నుంచి కొత్త ఫీచర్‌ ఫోన్‌.. పాత మోడల్‌ కంటే మెరుగైన ఫీచర్లతో..!!

జియో ప్రస్తుతం టెలికాం రంగంలో ప్రముఖ సంస్థగా ఉంది. ఇప్పటికే 5G నెట్‌వర్క్‌ను అనేక ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చిన జియో మరిన్ని ప్రాంతాలకు నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. దీంతోపాటు జియో ఫీచర్‌, స్మార్ట్‌ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే జియో భారత్‌ B1 పేరిట అందుబాటు ఉంది.

పాత మోడల్‌ కంటే మెరుగైన ఫీచర్లతో ఉండగా.. జియో భారత్‌ B2 (Jio Bharat B2) పేరుతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే జియో సంస్థ ఈ ఫోన్ విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మరియు ఎలాంటి ఫీచర్లను కలిగి ఉంటుందనే సమాచారం వెల్లడికాలేదు.

Jio Bharat B2 Phone spotted in BIS

జియో కొత్త ఫోన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్‌ వెబ్‌సైట్‌లో JBB121B1 పేరుతో నమోదైనట్లు తెలుస్తోంది. జియో సంస్థ ఈ మోడల్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది జియో భారత్‌ B2 ఫీచర్‌ ఫోన్‌గా తెలుస్తోంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు విడుదల తేదీపై త్వరలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న జియో భారత్‌ B1 ఫీచర్‌ ఫోన్‌ గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 4G సపోర్టును కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో UPI పేమెంట్‌ ఫీచర్‌ ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. మరియు రెండు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న జియో భారత్‌ B1 ఫోన్‌ 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ 50MB ర్యామ్‌తో వస్తుంది. మరియు ఈ ఫోన్ 2000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 343 గంటలపాటు ఛార్జింగ్‌ ఉంటుందని జియో చెబుతోంది. మరియు వెనుకవైపు కెమెరాను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ బ్లూటూత్‌, 4G, Wi-Fi, USB కనెక్టివిటీ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. మరియు నానో సిమ్‌ కార్డును సపోర్టు చేస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ జియో సినిమా, జియో సావన్‌ మరియు జియోపే వంటి యాప్‌లను కలిగి ఉంటుంది. జియోపేను UPI పేమెంట్లు చేయవచ్చు.

జియో భారత్‌ B1 4G స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌ మరియు బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.1299గా ఉంది. ఈ ఫోన్‌ భారత్‌లోని 23 భాషలను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ బరువు కేవలం 110 గ్రాములు మాత్రమే ఉంటుంది. జియో భారత్‌ కొత్త ఫోన్‌ B2 పై జియో ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Bharat B2 Phone could debut in India soon which is spotted in BIS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X