రూ.1799 కే జియో భారత్ J1 4G ఫోన్.. ఓటీటీ, UPI, జియోటీవీ సహా మరిన్ని ప్రత్యేకతలు..!
జియో తన ఫీచర్ ఫోన్ల పోర్ట్‌ఫోలియోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జియో భారత్ J1 4G ఫీచర్ ఫోన్ ను (Jio Bharat J1 4G Phone) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అయితే గతంలో జియో విడుదల చేసిన జియో భారత్ B2 మరియు B1 ఫీచర్ ఫోన్ల కంటే తాజాగా అందుబాటులోకి వచ్చిన J1 4G ఫోన్ పెద్ద డిస్‌ప్లే ను కలిగి ఉంది. మరియు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.
జియో భారత్ J1 4G ధర, సేల్ వివరాలు :
జియో భారత్ J1 4G ఫీచర్ ఫోన్ ధర రూ.1799 గా ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు (Jio Bharat J1 4G Phone Sale) చేయవచ్చు. ఆధునిక ఫీచర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ ఫోన్ లో జియో మనీ ద్వారా UPI పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంది. మరియు జియో సినిమా యాప్ ద్వారా OTT సర్వీసులకు కూడా పొందవచ్చు. HD కాలింగ్ సపోర్టు ఈ ఫోన్ సొంతం. దీంతోపాటు అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది.
2500mAh బ్యాటరీ :
జియో భారత్ J1 4G ఫీచర్ ఫోన్ 2.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 2500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 0.3MP వెనుక కెమెరా, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.
అయితే ఈ జియో భారత్ J1 4G ఫోన్‌లో కేవలం ఒక్క సిమ్ కార్డును మాత్రమే ఉపయోగించే వీలుంది. అది కూడా జియో మాత్రమే పనిచేస్తుంది. అయిత 4G VoLTE కాలింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 23 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. ఈ ఫోన్ జియో TV ను సపోర్టు చేస్తుంది. సుమారు 455 టీవీ ఛానళ్లను చూసేందుకు వీలుంది. మరియు జియో సినిమా యాప్‌ను కూడా వినియోగించుకోవచ్చు.
ఎంత ధరతో రీఛార్జ్ చేయించాలి :
జియో భారత్ J1 4G ఫోన్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను (Jio Bharat J1 4G Phone Recharge Plan) కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు కనీసం రూ.123 తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








