Home
Mobile

ధర రూ.1099కే జియోభారత్‌ V3, V4 4G ఫీచర్‌ ఫోన్‌లు.. రూ.123 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 14GB డేటా!

జియో భారత్‌ మార్కెట్‌లో ఇవాళ 4G ఫీచర్‌ ఫోన్‌లను విడుదల చేసింది. జియోభారత్‌ V3 మరియు జియోభారత్‌ V4 పేరుతో లాంచ్‌ చేసింది. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2023 సదస్సులో ఈ ఫీచర్‌ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ల ద్వారా UPI పేమెంట్‌లు చేయవచ్చు. మరియు లైవ్‌ TV ని కూడా వీక్షించవచ్చు. ఈ ఫోన్‌లు 23 భాషలను సపోర్టు చేయనున్నాయి. జియో ఫీచర్ ఫోన్‌లో టీవీ, UPI లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు.

జియోభారత్‌ V3 ఫోన్‌ను (JioBharat V3 Phone) స్టైల్‌ సెంట్రిక్‌ డివైస్‌గా లాంచ్‌ చేశారు. అదే జియోభారత్‌ V4 (JioBharat V4 Phone) ఫోన్‌ను మెరుగైన అనుభూతి పొందేలా డిజైన్‌ చేశారు. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని పొందవచ్చని జియో చెబుతోంది. జియోభారత్‌ V3 మరియు v4 ఫీచర్‌ఫోన్‌లు జియోఛాట్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. దీని ద్వారా అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ మెసెజ్‌, ఫోటో షేరింగ్‌, గ్రూప్‌ మెసేజింగ్‌ ఆప్షన్‌లను పొందవచ్చు.

Jio Bharat V3 and V4 4G feature phones Launched

ఈ రెండు 4G ఫీచర్‌ ఫోన్‌లు 1000mAh బ్యాటరీతో పనిచేయనున్నాయి. మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు. ఈ జియోభారత్‌ V3, V4 ఫోన్‌లు 23 భారతీయ భాషలను సపోర్టు చేస్తాయి. జియోటీవీ యాప్‌ను సపోర్టు చేస్తాయి. 455 లైవ్‌ టీవీ ఛానళ్లు వీక్షించేందుకు వీలుంటుందని జియో తెలిపింది. జియోసినిమా లైబ్రరీలో ఉన్న షోలు, సినిమాలను జియోభారత్‌ V3 మరియు V4 ఫోన్‌లో పొందవచ్చు.

UPI ఇన్‌బిల్ట్‌ సౌండ్‌ బాక్స్‌ :
దీంతోపాటు ఈ ఫోన్‌లు జియోపే యాప్‌ సపోర్టును కలిగి ఉంటాయి. ఫలితంగా UPI పేమెంట్‌లు చేసేందుకు వీలుంటుంది. దీంతోపాటు ఈ ఫీచర్‌లు ఫోన్‌లు ఇన్‌బిల్ట్‌ సౌండ్‌బాక్స్‌తో విడుదల అయ్యాయి. ఫలితంగా UPI లావాదేవీల వివరాలు స్పష్టంగా వినిపిస్తాయి.

రూ.123 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ఫోన్‌లకు రూ.123 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, మొత్తంగా 14GB డేటాను వినియోగించుకోవచ్చు. జియో భారత్‌ V3 మరియు V4 ఫీచర్‌ ఫోన్‌ల ధర రూ.1099 గా ఉంది. ఈ ఫోన్‌లు జియోమార్ట్‌, అమెజాన్‌ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా త్వరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే జియోలో :
ప్రస్తుత భారత్‌ మార్కెట్‌లో జియోభారత్‌ V2, జియోభారత్‌ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్బన్‌ భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ 2G నెట్‌వర్క్‌ వినియోగిస్తున్న యూజర్లకు 4G అనుభూతిని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గతంలోనే జియో తెలిపింది.

BSNL కూడా :
అయితే ఇటీవల BSNL కూడా ఫీచర్‌ ఫోన్‌లను తీసుకురానున్నట్లు ప్రకటన చేసింది. కార్బన్ మొబైల్స్‌ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొస్తామని అక్టోబర్‌ 1న ప్రకటన చేసింది. అయితే ఎంత ధరలో ఈ ఫీచర్‌ ఫోన్‌లు విడుదల చేస్తుంది మరియు ఎలాంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందో వివరాలు వెల్లడించలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Bharat V3 and V4 4G feature phones Launched in india At RS1099 price features and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X