లీక్ అయిన జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు, ఇంటర్నెట్‌లో వైరల్
టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన విప్లవం ఓ సునామినే తలపించిందని చెప్పవచ్చు.
టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన విప్లవం ఓ సునామినే తలపించిందని చెప్పవచ్చు. మొత్తం టెలికాం రంగం జియో రాక ముందు జియోవచ్చిన తరువాత అనే విధంగా ముకేష్ అంబానీ సెట్ చేశారు. ఎక్కడో ఆకాశాన ఉన్న ధరలను ఒక్కసారిగా భూమి మీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇదే ఊపుతో జియో అధినేత బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి వస్తున్నారు. అక్కడ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. బ్రాడ్‌బ్యాండ్ రంగంలోనూ జియో గట్టి పోటీనివ్వనుందని జియో గిగాఫైబర్‌ను అతి త్వరలోనో లాంచ్ చేయబోతున్నామని ఆ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

నెట్‌లో వైరల్..
జియో గిగాఫైబర్‌కుసంబంధించిన ప్లాన్లు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ప్రస్తుతం ఈ ప్లాన్లు నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయని లీకయిన వివరాలను బట్టి తెలుస్తోంది.

ప్రారంభ ప్లాన్ రూ.500
లీకయిన వివరాల ప్రకారం జియో గిగాఫైబర్ ప్రారంభ ప్లాన్ రూ.500గా ఉండనున్నట్లు తెలిసింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 50 ఎంబీపీఎస్ గరిష్ట స్పీడ్‌తో 300 జీబీ వరకు ఉచిత డేటా వస్తుంది. పరిమితి దాటితే స్పీడ్ తగ్గిపోతుంది.

రూ.750 ప్లాన్
ఇక రూ.750 ప్లాన్‌లో 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 450 జీబీ డేటా లభించనున్నట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 ఎంబీపీఎస్ గరిష్ట స్పీడ్‌తో సేవలు లభించనున్నాయి.

రూ.999 ప్లాన్
రూ.999 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 600 జీబీ వరకు డేటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 ఎంబీపీఎస్ గరిష్ట స్పీడ్‌తో సేవలు లభించనున్నాయి.

రూ.1299 ప్లాన్
రూ.1299 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 750 జీబీ డేటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 ఎంబీపీఎస్ గరిష్ట స్పీడ్‌తో సేవలు లభించనున్నాయి.

రూ.1599 ప్లాన్
రూ.1599 ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 900 జీబీ డేటాను ఇవ్వనున్నట్లు సమాచారం. 50 నుంచి 100 ఎంబీపీఎస్ గరిష్ట స్పీడ్‌తో సేవలు లభించనున్నాయి.

వాలిడిటీ నెల రోజులు
ఇక ఈ ప్లాన్ల వాలిడిటీ నెల రోజులుగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్లాన్ల గురించి జియో గిగాఫైబర్ ఎలాంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

15 నుంచి రిజిస్ట్రేషన్లు
ఈ నెల 15 నుంచి జియో గిగాఫైబర్ సేవలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా తొలుత 1100 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు.

రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే సిటీల్లోనే..
రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే సిటీల్లోనే ముందుగా గిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తామని జియో వెల్లడించింది.


Click it and Unblock the Notifications








