ప్రకంపనలు పుట్టిస్తోన్న రిలయన్స్ జియోఫోన్

మార్కెట్లో పెను ప్రకపంనలు పుట్టిస్తూ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ శుక్రవారం లాంచ్ చేసిన జియో 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఫోన్‌ అనౌన్స్ అయిన మరుక్షణం నుంచి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ మార్కెట్ పై గట్టి పట్టున్న మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు తమ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.1500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌తో..

కేవలం, రూ.1500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌తో జియో ఈ ఫోన్‌లను సప్లై చేయబోతున్న నేపథ్యంలో మిగలిన ఫీచర్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా సరిగ్గా ఇలాంటి ఆఫర్లనే మార్కెట్లో లాంచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా చేయని పక్షంలో భారీ నష్టాలు మూటగట్టుకోక తప్పదు.

జియో ఫోన్‌లతో పోటీ పడాలంటే..?

మైక్రోమాక్స్, లావా, ఇంటెక్స్ వంటి కంపెనీలు ఇప్పటికే బేసిక్ ఫీచర్లతో కూడిన 4జీ ఫీచర్ ఫోన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. జియో ఫోన్‌లతో ఇవి పోటీ పడాలంటే ఇతర టెలికం ఆపరేటర్లతో ఒప్పందాలు చేతులుకలపక తప్పదు.

ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న రిలయన్స్ జియోఫోన్ ఒకదెబ్బతో ఫీచర్ ఫోన్‌ల స్వరూపాన్నే మార్చేసింది. 50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లాంచ్ చేసిన జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌ మొత్తాన్నితనవైపుకు తిప్పుకున్నట్లయ్యింది. 4జీ VoLTE కనెక్టువిటీకి తోడకు స్మార్ట్‌ఫోన్ తరహా ప్రత్యేకతలతో రూపుదిద్దికున్న జియోఫోన్‌ ఉచితంగా దొరుకుతుందంటే ఎవరు వద్దంటారు చెప్పండి!.

ఇక స్మార్ట్‌ఫోన్‌లతో పనుండదు..

జియో సేవలు ఆస్వాదించాలనేవారు ఇప్పుడు ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవల్సిన అవసరం అనేదే ఉండుదు. సకలసౌకర్యాలతో వస్తోన్న "India ka intelligent smartphone" జియోఫోన్‌ను కొనుగోలు చేస్తే సరిపోతుంది.

ప్రతి ఒక్కరికి ఉచితం..

జియోఫోన్‌ ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు. జియోఫోన్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టంబర్ నుంచి ఫోన్ల‌ను డెలివరీ చేస్తారు.

రూ.153కే అన్‌లిమిటెడ్

జియోఫోన్ యూజర్లు కోసం రూ.153 బేస్ ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. జియోఫోన్ యూజర్లు నెలకు రూ.153 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఈ ఫోన్‌తో ఇన్‌‌బిల్ట్‌గా వస్తోన్న జియో యాప్స్ ద్వారా మ్యూజిక్, సినిమా, లైవ్ టీవీ ఇలా అనేక సదుపాయాలను ఆస్వాదించే వీలుంటుంది.

రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్స్.

రూ.153 బేస్ ప్యాక్‌తో పాటు రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్‌లను కూడా అంబానీ లాంచ్ చేసారు. రూ.24 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో, రూ.54 ప్యాక్ 7 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి.

జియో ఫోన్ టీవీ కేబుల్

జియో ఫోన్ టీవీ కేబుల్ ద్వారా జియోఫోన్‌ను ఎలాంటి టీవీకైనా కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది. 309 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా ఫోన్‌ను టీవీకి మిర్రర్ చేసుకుని నెల మొత్తం జియో సర్వీసులను పెద్దతెర పై ఆస్వాదించవచ్చు.

జియో యాప్స్‌ సూట్‌తో పాటు, NFC సపోర్ట్‌

జియో‌ఫోన్‌లో జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

 

ఎమర్జెన్సీ ఫీచర్‌..

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్ తో సహా షేర్ చేయబడుతుంది.

జియోఫోన్ స్పెసిఫికేషన్స్

2.4 అంగుళాల డిస్‌ప్లే, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio impact: Feature phone players brace for business shakeup. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot