ఆపిల్‌పై కన్నేసిన జియో, ఐఫోన్ వాడి తిరిగి ఇస్తే 70 శాతం డబ్బు వాపస్..
వరుస ఆఫర్లతో టెల్కోలకు చుక్కలు చూపించిన జియో ఇప్పుడు ఆపిల్ కంపెనీపై కన్నేసింది.
వరుస ఆఫర్లతో టెల్కోలకు చుక్కలు చూపించిన జియో ఇప్పుడు ఆపిల్ కంపెనీపై కన్నేసింది. ఆపిల్ కంపెనీ యూజర్లను ఆకర్షించే లక్ష్యంగా భారీ ఆఫర్లకు తెరలేపింది. ఆపిల్ సంస్ధ విడుదల చేసిన ఐఫోన్ 8, ఐఫోన్8 ప్లస్ ప్రీ బుకింగ్‌లు ఈ రోజు నుంచి స్టార్ట్ కానున్ననేపథ్యంలో జియో మరోసారి తన భారీ ఆఫర్లకు తెరతీసింది. ఆ ఆఫర్లపై ఓ లుక్కేయండి మరి.

ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే..
కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన 8 ప్లస్ వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

ఉదాహరణకు
ఉదాహరణకు ఐఫోన్ 8 ప్లస్‌లో మోడల్‌లో 256జీబీ ఫోన్‌ను రూ.86వేలకు కొన్న వినియోగదారుడు మళ్లీ ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే రూ.60,200 తిరిగి ఇస్తారన్నమాట

సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య
సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా స్మార్ట్ ఫోన్‌లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

64జీబీ, 256జీబీ వేరియంట్లలో
కేవలం సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 29 మధ్యలో బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రెండు మోడళ్లు 64జీబీ, 256జీబీ వేరియంట్లలో వస్తున్నాయి.

ప్రత్యేక తారిఫ్‌లను
అయితే ఈ ఆఫర్ సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం. అంతేకాదు వీటితో పాటు ఐ ఫోన్లకు ప్రత్యేక తారిఫ్‌లను కూడా జియో ప్రకటించింది.

పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు
ఐ ఫోన్ 8 లో పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు 28 రోజుల వాలిడిటీతో రూ. 799 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ సదుపాయంతోపాటు 90 జీబీ డేటా ఉచితం. అలాగే కాంప్లిమెంటరీ ప్రీమియం సభ్యత్వం కూడా.

ఈ సదుపాయం..
రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ఈ సదుపాయం ఉన్నట్టు తెలిపింది.ఐ పోన్ 8, ఐఫోన్ 8ప్లస్ లను సెప్టెంబర్ 22 నుంచి రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే 29 నుంచి అన్ని స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి.


Click it and Unblock the Notifications