జియోఫోన్ 2 బెస్ట్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు,కేవలం రూ. 501కే జియోఫోన్

|

దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో గతేడాది జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్ మార్కెట్‌లో విజయం సాధించింది. ఎన్నో లక్షల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. దీంతో ఆ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ సంస్థ జియో ఫోన్ 2 పేరిట ఆ ఫోన్‌కు కొనసాగింపుగా నూతన ఫీచర్ ఫోన్‌ను ఇవాళ విడుదల చేసింది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇవాళ జరిగిన ఆ సంస్థ 41వ వార్షిక సమావేశంలో జియో ఫోన్ 2పై ప్రకటన చేశారు. అయితే ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే జియో మాన్ సూన్ హంగామా' పేరిట కొత్త ఆఫర్‌ను ప్రకటించారు.

 

వరాలజల్లులు కురిపించిన జియో అధినేత, మీటింగ్ హైలెట్స్వరాలజల్లులు కురిపించిన జియో అధినేత, మీటింగ్ హైలెట్స్

మాన్ సూన్ హంగామా..

మాన్ సూన్ హంగామా..

జియో అధినేత ముఖేష్ అంబానీ మాన్ సూన్ హంగామా' పేరిట ఓ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. ఈ ఆఫర్‌ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్‌ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు.

రూ.501 అదనంగా చెల్లిస్తే..

రూ.501 అదనంగా చెల్లిస్తే..

ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు గాను బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఇప్పటికే జియో ఫోన్‌ను వాడేవారు ఆ ఫోన్‌ను ఇచ్చేసి రూ.501 అదనంగా చెల్లిస్తే దాంతో జియో ఫోన్ 2 ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు.

జియోఫోన్‌ 2 విక్రయాలు

జియోఫోన్‌ 2 విక్రయాలు

అయితే కమర్షియల్‌గా ఈ కొత్త జియోఫోన్‌ 2 విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.2,999గా ముఖేష్‌ అంబానీ చెప్పారు.

జియోఫోన్ 2 ఫీచర్లు
 

జియోఫోన్ 2 ఫీచర్లు

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

మై జియో', జియో డాట్ కామ్'లో రిజిస్టర్..

మై జియో', జియో డాట్ కామ్'లో రిజిస్టర్..

ప్రస్తుతం జియో గిగా ఫైబర్ ట్రయల్స్ నడుస్తున్నాయని, ఆగస్టు 15 నుంచి 'మై జియో', 'జియో డాట్ కామ్'లో రిజిస్టర్ చేసుకున్న వారికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దగ్గర చేస్తామని అన్నారు. అత్యధిక రిజిస్ట్రేషన్లు వచ్చిన ప్రాంతానికి తొలి సేవలు అందుతాయని వెల్లడించారు.

ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు ..

ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు ..

చౌకధరలో లభిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ జియో ఫోన్ లో ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు అందుబాటులోకి రానున్నాయని, అవి కూడా వాయిస్ కమాండ్ కంట్రోలింగ్ లో ఉంటాయని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈ సేవలను రిలయన్స్ జియో ప్రజలకు అందుబాటులోకి తేనుందని అన్నారు.

డిజిటల్ విప్లవాత్మకత దిశగా..

డిజిటల్ విప్లవాత్మకత దిశగా..

డిజిటల్ విప్లవాత్మకత దిశగా ఇండియాను నడిపించేందుకు జియో పుట్టిందని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియాలో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫీచర్ ఫోన్లను 50 కోట్ల మంది వాడుతున్నారని గుర్తు చేశారు.

పూర్తి రిఫండబుల్ డిపాజిట్ తో..

పూర్తి రిఫండబుల్ డిపాజిట్ తో..

గత సంవత్సరం పూర్తి రిఫండబుల్ డిపాజిట్ తో రూ. 1,500కే జియో ఫోన్ ను అందించామని తెలిపారు. ఇది 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' గా మారి 2.5 కోట్ల మంది చేతుల్లోకి చేరిందని వెల్లడించారు. ఈ స్కీమ్ కొనసాగుతుందని తెలిపారు.

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే జియోఫోన్2లో మొత్తం డిజైన్‌ను రిలయన్స్‌ మార్చింది. జియోఫోన్‌ బేసిక్‌ ఫీచర్‌ ఫోన్‌ మాదిరి ఉంటే, జియోఫోన్‌ 2 ఎంట్రీ-లెవల్‌ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్‌ వెర్షన్‌ జియోఫోన్‌ 2గా కంపెనీ అభివర్ణించింది.

ఎనీ సిమ్..

ఎనీ సిమ్..

జియోఫోన్‌ 2 డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్‌ కార్డు స్లాట్‌ లాక్‌ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్‌ కోసమే రూపొందించారు. రెండో సిమ్‌ కార్డు స్లాట్‌​ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Jio Monsoon Hungama offer: Exchange old phone to get new Jiophone at just rs 501

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X