Home
Mobile

డెలివరీ ఎప్పుడో తెలియదు, జియోఫోన్ 2 బుకింగ్స్ రేపటి నుంచే, బుకింగ్ ఎలా ?

దేశీయ మొబైల్ మార్కెట్లోకి సునామిలాగా దూసుకొచ్చిన జియో అత్యంత తక్కువ ధరకే జియోఫోన్ ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే.

By Hazarath Aiah

దేశీయ మొబైల్ మార్కెట్లోకి సునామిలాగా దూసుకొచ్చిన జియో అత్యంత తక్కువ ధరకే జియోఫోన్ ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ విజయవంతమైన నేపథ్యంలో జియోఫోన్ 2 పేరుతో మరో సరికొత్త ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్ బుకింగ్స్ రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్ 2పై ప్రకటన చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే రేపటి నుంచి జియో ఫోన్ 2 కు గాను బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. మరి బుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే..

జియో వెబ్‌సైట్, మై జియో యాప్‌లలో

జియో వెబ్‌సైట్, మై జియో యాప్‌లలో

జియోఫోన్ 2కు గాను జియో వెబ్‌సైట్, మై జియో యాప్‌లలో బుకింగ్స్‌ను చేసుకునేందుకు వీలు కల్పించారు. దీనికోసం మీరు ఆ పేజీల్లోకి ముందుగా వెళ్లాలి.

జియోఫోన్ 2 రిజిస్ట్రేషన్ పేజీపై..

జియోఫోన్ 2 రిజిస్ట్రేషన్ పేజీపై..

ఆ పేజీలోకి ఎంటరయిన తరువాత జియోఫోన్ 2 రిజిస్ట్రేషన్ పేజీపై క్లిక్ చేసి, గెట్ నౌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

 పేరు, ఫోన్ నంబర్, అడ్రస్..

పేరు, ఫోన్ నంబర్, అడ్రస్..

అనంతరం వచ్చే పేజీలో పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ ఇతర వివరాలను నమోదు చేయాలి.

రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే డబ్బు

రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే డబ్బు

అక్కడ మీరు ఫోన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే డబ్బు చెల్లించాలి. ఇంతకుముందు డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించే ఆప్సన్ ఉండేది. ఇప్పుడు అది తీసేశారు.

రూ.2,999 చెల్లిస్తే ..

రూ.2,999 చెల్లిస్తే ..

నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.2,999 చెల్లిస్తే ఫోన్‌ను డెలివరీ చేస్తారు.జి యో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆ ఫోన్లను ఎప్పుడు డెలివరీ చేస్తారో ఆ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

 కొన్ని రోజుల్లోనే ఈ ఫోన్లను డెలివరీ..

కొన్ని రోజుల్లోనే ఈ ఫోన్లను డెలివరీ..

అయితే కంపెనీ నుంచి వచ్చిన అనధికార సమాచారం ప్రకారం బుక్ చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఈ ఫోన్లను డెలివరీ చేయవచ్చని తెలిసింది.

జియోఫోన్ 2లో ఫీచర్లు

జియోఫోన్ 2లో ఫీచర్లు

రిలయన్స్ జియోఫోన్ 2లో ఫిజికల్ కీబోర్డు, వాట్సప్‌తోపాటు పలు ఇతర ఆకట్టుకునే ఫీచర్లు కస్టమర్లకు లభ్యం కానున్నాయి. 2.4 ఇంచుల డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Phone 2 at price of Rs 2,999: Sale begins tomorrow, here’s how to order more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X