ఈ రోజు 12:pm కి జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ షురూ !
దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో గతేడాది జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్ మార్కెట్‌లో విజయం సాధించింది. ఎన్నో లక్షల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు.
దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో గతేడాది జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్ మార్కెట్‌లో విజయం సాధించింది. ఎన్నో లక్షల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. దీంతో ఆ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ సంస్థ జియో ఫోన్ 2 పేరిట ఆ ఫోన్‌కు కొనసాగింపుగా మరో ఫోన్ ను కూడా విడుదల చేసారు . ఈ ఫోన్ కూడా మార్కెట్‌లో విజయం సాధించింది . ఈ నేపథ్యంలో జియో ఫోన్ 2 రెండవ సారి ఫ్లాష్ సేల్ కి రానుంది.ఈ రోజు మధ్యాహ్నం 12:00pm ఫ్లాష్ సేల్ షురూ కాబోతుంది . ఈ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకున్నవారు జియో అధికారిక వెబ్ సైట్ jio.com లో బుక్ చేసుకోవచ్చు.

జియోఫోన్ 2 ఫీచర్లు....
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్, కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్ సెన్సార్, వీజీఏ సెన్సార్, డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టు.

మొదటి జియోఫోన్‌తో పోలిస్తే..
మొదటి జియోఫోన్‌తో పోలిస్తే జియోఫోన్2లో మొత్తం డిజైన్‌ను రిలయన్స్ మార్చింది. జియోఫోన్ బేసిక్ ఫీచర్ ఫోన్ మాదిరి ఉంటే, జియోఫోన్ 2 ఎంట్రీ-లెవల్ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్ వెర్షన్ జియోఫోన్ 2గా కంపెనీ అభివర్ణించింది.

ఎనీ సిమ్..
జియోఫోన్ 2 డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్ కార్డు స్లాట్ లాక్ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్ కోసమే రూపొందించారు. రెండో సిమ్ కార్డు స్లాట్ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు

ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు....
చౌకధరలో లభిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ జియో ఫోన్ లో ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు అందుబాటులో ఉంటాయి , అవి కూడా వాయిస్ కమాండ్ కంట్రోలింగ్ లో ఉంటాయి .

ఫోన్ బుక్ చేసిన 5 నుంచి 7 రోజుల లోపల....
ఈ ఫోన్ రూ. 2,999 ధరతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ బుక్ చేసిన 5 నుంచి 7 రోజుల్లో షిప్పింగ్ చేయబడుతుంది. 4 జీ ఫీచర్ ఫోన్ కోసం రూ. 49, రూ. 99 మరియు రూ. 153 ఈ మూడు జియో రీచార్జ్ ప్లాన్స్ కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు.

గూగుల్ వాయిస్ కమాండ్స్ ద్వారా ..
గూగుల్ వాయిస్ కమాండ్స్ ద్వారా జియోఫోన్ 2ను కంట్రోల్ చేసుకోవచ్చు. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ సౌలభ్యంతో వస్తోన్న ఈ డివైస్‌లో 4జీ ఎల్టీఈ విత్ VoLTE , VoWi-Fi, ఎఫ్ఎమ్, బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ వంటి స్టాండర్డ్ కమ్యూనికేషన్స్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక యాప్స్ విషయానికి వచ్చేసరికి ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటి ఉపయుక్తమైన అప్లికేషన్‌లను జియోఫోన్ 2 క్యారీ చేస్తుంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్, జియో చాట్ వంటి యాప్స్ ప్రీమియమ్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తాయి.

రూ.49 టారిఫ్ ప్లాన్‌తో..
జియోఫోన్ 2ను ఉద్దేశించి పలు ప్రత్యేకమైన టారిఫ్ ప్లాన్‌లను జియో అనౌన్స్ చేసింది. రూ.49, రూ.99, రూ.153 టారిఫ్ లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. 49 రూపాయిల ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నెలంతా కాల్స్‌తో పాటు 1జీబి డేటా ఇంకా 50 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

రూ.99, రూ.153 టారిఫ్ ప్లాన్‌లతో..
రూ.99 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నెలంతా కాల్స్‌తో పాటు 14జీబి డేటా ఇంకా 300 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రూ.153 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా నెలంతా కాల్స్‌తో పాటు 42జీబి డేటా ఇంకా అన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్



Click it and Unblock the Notifications








