జియోఫోన్ 2 దక్కించుకునేందుకు మరో అవకాశం

ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం రేపిన జియోఫోన్‌కు సక్సెసర్‌గా జియోఫోన్2ని రిలయన్స్ అధినేత మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

|

ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం రేపిన జియోఫోన్‌కు సక్సెసర్‌గా జియోఫోన్2ని రిలయన్స్ అధినేత మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ ప్లాష్ సేల్ కొచ్చిన ప్రతీసారి దుమ్మురేపుతోంది. ఇప్పటికే నిర్వహించిన ఫ్లాష్‌సేల్‌లో లక్షల మంది ఫోన్‌ను కొనుగోలు చేశారు. కాగా జియోఫోన్ 2 కొనుగోలు చేయాలనుకునే వారి కోసం మరో ఫ్లాష్‌సేల్ ప్రకటించింది. నాలుగో ఫ్లాష్ సేల్‌ను సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ Jio.comలో పేర్కొంది.

 

రూ. 20 వేలల్లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లురూ. 20 వేలల్లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

ధర రూ.2,999

ధర రూ.2,999

మూడో సేల్‌ను ఈనెల 6న నిర్వహించగా నిమిషాల వ్యవధిలో అవుట్ ఆఫ్ స్టాక్ దర్శనమిచ్చాయి. 4జీ ఫీచర్ ఫోన్ ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2లో అందిస్తున్నారు. దీని ధర రూ.2,999 గా ఉంది.

రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్

రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్

ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

జియోఫోన్ 2 ఫీచర్లు
 

జియోఫోన్ 2 ఫీచర్లు

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే..

జియోఫోన్‌తో పోలిస్తే జియోఫోన్2లో మొత్తం డిజైన్‌ను రిలయన్స్‌ మార్చింది. జియోఫోన్‌ బేసిక్‌ ఫీచర్‌ ఫోన్‌ మాదిరి ఉంటే, జియోఫోన్‌ 2 ఎంట్రీ-లెవల్‌ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్‌ వెర్షన్‌ జియోఫోన్‌ 2గా కంపెనీ అభివర్ణించింది

ఎనీ సిమ్..

ఎనీ సిమ్..

జియోఫోన్‌ 2 డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్‌ కార్డు స్లాట్‌ లాక్‌ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్‌ కోసమే రూపొందించారు. రెండో సిమ్‌ కార్డు స్లాట్‌​ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు.

ఆసక్తికర ప్రకటన

ఆసక్తికర ప్రకటన

ఉచిత ఆఫర్లతో 4జీ సేవలతో దూసుకొచ్చిన జియో అనతికాలంలోనే అత్యధిక కస్టమర్లను ఆకట్టుకుని దేశీయ టెలికాం రంగంలో అతి పెద్ద టెలికాం వ్యవస్థగా నిలిచింది. అయినప్పటికీ ఇంకా ఏదో వెలితి జియోని వెంటాడుతున్నట్లుగా అనిపించిందేమో ఇప్పుడు ఏకంగా 5జీతో దూసుకువచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఓ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది.

5జీ సేవలను అందించేందుకు..

5జీ సేవలను అందించేందుకు..

దేశంలో 5జీ సేవలను అందించేందుకు అమెరికా ఆధారిత టెలికాం సొల్యూషన్స్ సంస్థను ముకేష్ అంబానీ సారథ్యంలోని జియో కొనుగోలు చేయనుంది.

రాడీసిస్‌తో ఒప్పందం

రాడీసిస్‌తో ఒప్పందం

అమెరికాకు చెందిన రాడీసిస్‌తో ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది. ఓపెన్‌ టెలికాం సొల్యూషన్స్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న రాడిసిస్‌ కార్పొరేషన్‌ కొనుగోలుకు ఒక ఒప్పందం చేసుకున్నామని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

డీల్‌ విలువ

డీల్‌ విలువ

ఈ డీల్‌ విలువ సుమారుగా 74మిలియన్ డాలర్లు. భారతీయులకు 5జీ, ఇంటర్నెట్ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ) లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని జియో వెల్లడించింది.

అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు

అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు

ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతితోపాటు, రాడిసిస్‌ వాటా దారుల సమ్మతి పొందాల్సి ఉందని తెలిపింది. 2018 చివరి(నాలుగు) త్రైమాసికానికి ఈ డీల్‌ పూర్తికానుందని భావిస్తోంది. అలాగే అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది.

త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి

త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి

రాడిసిస్‌కు చెందిన టాప్-క్లాస్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ టీం రిలయన్స్‌కు త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి నైపుణ్యాలను అందిస్తుందని, తద్వారా వినియోగదారులు సేవలు మెరుగవుతాయని రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాష్ అంబానీ చెప్పారు.

రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన

రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన

నాస్డాక్-లిస్టెడ్ కంపెనీగా రాడిసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు, మద్దతు కార్యాలయాలతో పాటు, బెంగళూరులో కూడా ఒక ఇంజనీరింగ్‌ టీమ్‌ కలిగి ఉందని రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన తెలిపింది.

రాడిసిస్‌లో దాదాపు 600 ఉద్యోగులు

రాడిసిస్‌లో దాదాపు 600 ఉద్యోగులు

ఒరెగాన్‌లోని హిల్స్‌ బోరోలో ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడిసిస్‌లో దాదాపు 600 ఉద్యోగులు ఉన్నారు. ఈ డీల్‌ ముగిసిన తరువాత రాడిసిస్‌ డీలిస్ట్‌ కానుంది.ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస‍్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ డీల్ తోడ్పడనుంది జియో భావిస్తోంది.

రెండేళ్ల క్రితం

రెండేళ్ల క్రితం

రెండేళ్ల క్రితం భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ఒకే ఒక అంశం రిలయన్స్ జియో.. మాట్లాడుకోవడానికి చెల్లించక్కర్లేదు.. డేటాకు మాత్రమే చెల్లించండి అనే ట్యాగ్‌లైన్‌తో జియో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.

Best Mobiles in India

English summary
Next JioPhone 2 sale to begin on Sept 12; Here’s what you need to know more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X