ఆగష్టు 30న మరోసారి సేల్ పై జియోఫోన్ 2
జియో ఫోన్ 2 మొదటి ఫ్లాష్ సేల్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో రెండవ ఫ్లాష్ సేల్‌ను ఆ సంస్థ అనౌన్స్ చేసింది.
జియో ఫోన్ 2 మొదటి ఫ్లాష్ సేల్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో రెండవ ఫ్లాష్ సేల్‌ను ఆ సంస్థ అనౌన్స్ చేసింది. ఆగష్టు 30న ఈ రెండవ సేల్ జరుగుతుంది. Jio.com వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో భాగంగా లిమిటెడ్ స్టాక్స్‌లో మాత్రమే జియోఫోన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

జియోఫోన్ స్పెసిఫికేషన్స్..
2.4 ఇంచ్ హారిజెంటల్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఫుల్ క్వెర్టీ కీప్యాడ్ అండ్ ఫోర్-వే నేవిగేషన్ ప్యాడ్, kia మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 205 లేదా స్ప్రెడ్‌ట్రమ్ SC9820 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కేమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్ వాయిస్ కమాండ్స్ ద్వారా ..
గూగుల్ వాయిస్ కమాండ్స్ ద్వారా జియోఫోన్ 2ను కంట్రోల్ చేసుకోవచ్చు. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ సౌలభ్యంతో వస్తోన్న ఈ డివైస్‌లో 4జీ ఎల్టీఈ విత్ VoLTE , VoWi-Fi, ఎఫ్ఎమ్, బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ వంటి స్టాండర్డ్ కమ్యూనికేషన్స్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక యాప్స్ విషయానికి వచ్చేసరికి ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటి ఉపయుక్తమైన అప్లికేషన్‌లను జియోఫోన్ 2 క్యారీ చేస్తుంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్, జియో చాట్ వంటి యాప్స్ ప్రీమియమ్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తాయి.

రూ.49 టారిఫ్ ప్లాన్‌తో..
జియోఫోన్ 2ను ఉద్దేశించి పలు ప్రత్యేకమైన టారిఫ్ ప్లాన్‌లను జియో అనౌన్స్ చేసింది. రూ.49, రూ.99, రూ.153 టారిఫ్ లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. 49 రూపాయిల ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నెలంతా కాల్స్‌తో పాటు 1జీబి డేటా ఇంకా 50 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

రూ.99, రూ.153 టారిఫ్ ప్లాన్‌లతో..
రూ.99 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నెలంతా కాల్స్‌తో పాటు 14జీబి డేటా ఇంకా 300 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రూ.153 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా నెలంతా కాల్స్‌తో పాటు 42జీబి డేటా ఇంకా అన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.


Click it and Unblock the Notifications








