Home
Mobile

పేలిన జియో ఫోన్ ఫోన్, కంపెనీ దిమ్మతిరిగే సమాధానం !

జియో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

By Hazarath

దేశంలో సంచలనం సృష్టించిన జియో ఫోన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. జియో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ గటనపై తక్షణమే స్పందించిన జియో యూజమాన్యం ఆ కస్టమర్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జియో బ్రాండును దెబ్బతీయడానికే ఈ పనులు చేస్తున్నారని జియో ఆరోపిస్తోంది.

ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా..

ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా..

జియో ఫీచర్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలిందంటూ ఓ యూజర్ ట్విట్టర్ ద్వారా పేలిన ఫోటోలతో సహా అందులో ట్వీట్ చేశాడు. తర్వాత దానిని డిలిట్ చేశాడు.

image source: phone radar

ఈ ఘటన జరిగినట్లు తమకు తెలుసని..

ఈ ఘటన జరిగినట్లు తమకు తెలుసని..

కశ్మీర్‌లో ఈ ఘటన జరిగినట్లు టెక్ బ్లాగ్ ఫోన్ రాడార్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ ఘటన జరిగినట్లు తమకు తెలుసని, కావాలనే సదరు కస్టమర్ ఇలా చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని రిలయెన్స్ వివరణ ఇచ్చింది

ఫోన్ వెనుక భాగం పూర్తిగా పాడైపోగా

ఫోన్ వెనుక భాగం పూర్తిగా పాడైపోగా

ఈ పేలుడులో ఫోన్ వెనుక భాగం పూర్తిగా పాడైపోగా.. ముందు భాగం మాత్రం చెక్కు చెదరనట్లు ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఈ పేలుడు తర్వాత కూడా బ్యాటరీ పనిచేస్తున్నట్లు ఈ ఫోన్‌ను చెక్ చేసిన లైఫ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.

image source: phone radar

స్పందించిన రిలయెన్స్ ప్రతినిధి

స్పందించిన రిలయెన్స్ ప్రతినిధి

ఈ ఘటనపై స్పందించిన రిలయెన్స్ ప్రతినిధి జియో ఫోన్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తయారు చేయించాం. ప్రతి ఫోన్‌ను క్వాలిటీ టెస్ట్ చేయించాం. పేలుడు ఘటన గురించి మాకు తెలిసింది. అయితే అది కావాలనే చేసినట్లు మా విచారణలో తేలిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

image source: phone radar

1500 డిపాజిట్‌తో వచ్చిన ఈ ఫోన్‌

1500 డిపాజిట్‌తో వచ్చిన ఈ ఫోన్‌

కాగా 1500 డిపాజిట్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ ఫోన్‌కు పోటీగా కార్బన్‌తో చేతులు కలిపి ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను, మైక్రోమ్యాక్స్‌తో కలిసి బీఎస్‌ఎన్‌ఎల్ భారత్-1 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance JioPhone explodes while charging in J&K, company says it is a case of intentional sabotage more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X