జియో ఫోన్ ఫ్రీ ఆర్డర్స్ స్టార్ట్, ఏం అడుగుతున్నారంటే..

Written By:

రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించిన రిలయన్స్ జియో ఉచిత 4జీ ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ఎంపిక చేసిన స్టోర్లలో ఈ ఫ్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఢిల్లీలో ఈ ఫ్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి పూర్తి స్థాయి ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమవుతాయని జియో తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

ఏది బెటర్, జియో ఫోన్ vsఇంటెక్స్ టర్బో 4G+vsఐడియా రూ.2500 ఫోన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దశలవారీగా అన్ని స్టోర్లలోనూ

ఆగస్టు 24 నుంచి డెలివరీ కానున్న ఫోన్ల ముందస్తు బుకింగ్స్ ఎంపిక చేసిన రిలయన్స్ స్టోర్లలో ఒకేసారి ప్రారంభమయ్యాయి. దశలవారీగా అన్ని స్టోర్లలోనూ బుకింగ్స్ తీసుకుంటామని సంస్థ వర్గాలు తెలిపాయి.

రూ. 1500 డిపాజిట్

ఈ ఫోన్ కావాలంటే తొలుత రూ. 1500 డిపాజిట్ చేయాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఆపై మూడేళ్ల తరువాత ఆ డబ్బును రిలయన్స్ వెనక్కు ఇచ్చేస్తుంది.

ఆధార్ కార్డు

ఇక ఈ ఫోన్ బుక్ చేసుకోవాలంటే జియో అధీకృత రిటెయిలర్ వద్దకు వెళ్లి, ఆధార్ కార్డు జిరాక్సును అందించాల్సి వుంటుంది.

ఒక ఆధార్ కార్డు నంబర్ తో

ఒక ఆధార్ కార్డు నంబర్ తో ఒక ఫోన్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 1 నుంచి 4 మధ్య డెలివరీ

ఇక నేడు ఫోన్ కోసం ఆర్డర్ చేసే వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 మధ్య డెలివరీ అందుతుందని జియో వర్గాలు వెల్లడించాయి.

వారానికి 50 లక్షల యూనిట్లను

వారానికి 50 లక్షల యూనిట్లను డెలివరీ చేస్తామని సంస్థ వర్గాలు వెల్లడించాయి. కాగా, మై జియో యాప్ నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

జియో ఫీచర్ ఫోన్‌లో వేరే కంపెనీ సిమ్ పనిచేయదు !

జియో ఫీచర్ ఫోన్‌లో వేరే కంపెనీ సిమ్ పనిచేయదు ! తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి 

రూ.1500 డిపాజిట్ వెనుక అసలు కథ ?

జియో ఫీచర్ ఫోన్ రూ.1500 డిపాజిట్ వెనుక అసలు కథ ? మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Phone booking starts at Delhi NCR offline retail stores; from documents needed to delivery date, know everything here Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot