జియో రూ.501 ఫోన్ పూర్తి స్కీమ్ వివరాలు, ఆఫర్లు తెలుసుకోండి
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్ ప్రారంభమైంది.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లు వాడుతున్న వాళ్లను జియోకు మారడం కోసం జియో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కేవలం 501 రూపాయలకే జియోఫోన్‌ను కస్టమర్లకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రూ.501 కూడా మూడేళ్ల తర్వాత ఫోన్ ఇస్తే వంద శాతం తిరిగిస్తారు. అలాగే ప్రత్యేకమైన ఓ రీచార్జ్ ప్లాన్‌ను కూడా జియో ప్రకటించింది. కాగా ఈ ఆఫర్ జియో స్టోర్స్‌లో, మిగిలిన పార్ట్‌నర్ స్టోర్స్‌లో కూడా ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని జియో తెలిపింది. ప్లాన్ పూర్తి వివరాలు, రూల్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

2జీ, 3జీ, 4జీ కనెక్టివిటీ ఆధారంగా..
2జీ, 3జీ, 4జీ కనెక్టివిటీ ఆధారంగా పాత ఫోన్లను తీసుకుంటామని జియో చెప్పింది. అయితే కస్టమర్లు తెచ్చిన పాత ఫోన్లు కచ్చితంగా పనిచేసేలా ఉండాలి. పైగా చార్జర్ కూడా కచ్చితంగా ఉండాలి.

మూడేళ్ల తర్వాత రీఫండ్
మాన్‌సూన్ హంగామా ఆఫర్ కింద కొత్త జియోఫోన్ కోసం యూజర్లు చెల్లించే రూ.501ను మూడేళ్ల తర్వాత రీఫండ్ చేయనున్నారు. కొత్త జియోఫోన్ కొనుగోలు చేసేటప్పుడు, పాత ఫీచర్ ఫోన్‌ను రిటైలర్‌కు ఇచ్చేయాలి.

2015, జనవరి 1 తర్వాత..
2015, జనవరి 1 తర్వాత అమ్మిన ఫోన్లను మాత్రమే ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. ఇలాంటి కస్టమర్లకు రూ.501 తీసుకొని కొత్త జియో సిమ్‌తోపాటు జియో ఫోన్ ఇస్తారు.

పాత నంబరే కావాలంటే
ఒకవేళ పాత నంబరే కావాలంటే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. వారు మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ) పెట్టుకోవాలి. ఎంఎన్‌పీ పెట్టుకున్నాక, మాన్‌సూన్ హంగామా ఆఫర్ పొందాల్సి ఉంటుంది. కొత్త రీచార్జ్ ప్లాన్ కింద రీచార్జ్ చేసుకోవచ్చు.

ప్రత్యేకమైన రీచార్జ్ ఆఫర్
మాన్‌సూన్ హంగామా ఆఫర్ కిందట ఓ ప్రత్యేకమైన రీచార్జ్ ఆఫర్‌ను కూడా జియో ఇస్తున్నది. రూ.594 చెల్లిస్తే అపరిమిత వాయిస్, డేటా ప్రయోజనాలు ఆరు నెలల పాటు పొందనున్నారు.

రూ.101 విలువైన 6 జీబీ డేటా
దీనికితోడు పాత ఫోన్లు ఎక్స్‌చేంజ్ చేసుకునేవాళ్లకు రూ.101 విలువైన 6 జీబీ డేటా వోచర్‌ను ఫ్రీగా ఇవ్వనున్నారు. ఈ లెక్కన మొత్తంగా ఆరు నెలలకు 90 జీబీ డేటా వస్తుంది.

రూ.99 రీచార్జ్ ప్లాన్
ఇక కొత్తగా రూ.99 రీచార్జ్ ప్లాన్‌ను కూడా జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 టెక్ట్స్ మెసేజ్‌లు ఇస్తారు.

ఆగస్టు 15 నుంచి
ఆగస్టు 15 నుంచి కొత్త, పాత జియోఫోన్ యూజర్లకు ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ గూగుల్ మ్యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తోంది.

25 మిలియన్ ప్రజలు
ఇప్పటి వరకు 25 మిలియన్ ప్రజలు జియోఫోన్‌ను కొనుగోలు చేశారని రిలయన్స్ నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపిన సంగతి తెలిసిందే. జియోఫోన్ 100 మిలియన్ కన్జ్యూమర్లను చేరుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉంటే ..
మీరు ఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉంటే వర్కింగ్ కండీషన్‌లో ఉన్న మీ పాత మొబైల్ ఫోన్, పాత ఫోన్ బ్యాటరీ అండ్ ఛార్జర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ పోర్టబులిటీ పెట్టుకుంటే, కొత్త ఎంఎన్‌పీ జియో నెంబర్‌లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications








