జియో షాక్, ఆ ఫోన్ ఖరీదు రూ.501 కాదు, రూ.1095

సంచలనాలతో దూసుకుపోతున్న జియో ఈ మధ్య జియోఫోన్ మీద మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

|

సంచలనాలతో దూసుకుపోతున్న జియో ఈ మధ్య జియోఫోన్ మీద మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆఫర్ ద్వారా పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకుని జియోఫోన్ ని యూజర్లు పొందవచ్చు. అయితే ఇందుకోసం యూజర్లు రూ.501 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ మొత్తంపై ఇప్పుడు జియో యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ ద్వారా జియోఫోన్ పొందాలనుకునే యూజర్లు మొత్తం రూ. . 1,095 చెల్లించాలని కంపెనీ ఇచ్చిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.

 

జియో రూ.501 ఫోన్ పూర్తి స్కీమ్ వివరాలు, ఆఫర్లు తెలుసుకోండిజియో రూ.501 ఫోన్ పూర్తి స్కీమ్ వివరాలు, ఆఫర్లు తెలుసుకోండి

వార్షిక సాధారణ సమావేశంలో..

వార్షిక సాధారణ సమావేశంలో..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వర్కింగ్‌ కండీషన్‌లో ఉన్న పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చేసి, జియోఫోన్‌ను కేవలం రూ.501కే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

 మూడేళ్ల తర్వాత రీఫండ్‌

మూడేళ్ల తర్వాత రీఫండ్‌

కాగా ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత రీఫండ్‌ చేయనున్నామని కూడా పేర్కొంది. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి జియోస్టోర్లు, అధికారిక రిటైల్‌ పార్టనర్ల వద్ద ఈ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది.

ఎక్కువ వివరాలను కంపెనీ రివీల్‌ చేయలేదు
 

ఎక్కువ వివరాలను కంపెనీ రివీల్‌ చేయలేదు

అయితే ఈ ఆఫర్‌పై ఇంకా ఎక్కువ వివరాలను కంపెనీ రివీల్‌ చేయలేదు. అయితే దీనికోసం కస్టమర్లు మొత్తంగా ఎంత చెల్లించాలి అనేది ప్రస్తుతం కంపెనీ అధికారిక కమ్యూనికేషన్‌లో తెలిపింది.

మరో రూ.594

మరో రూ.594

కొత్త జియోఫోన్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను పొందాలంటే రూ.501తో పాటు కచ్చితంగా మరో రూ.594ను కూడా చెల్లించాలట. ఈ మొత్తం ఆరు నెలల పాటు డేటా, వాయిస్‌ కాల్స్‌ పొందడం కోసం ఉపయోగపడుతుంది.

జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే

జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే

ఈ మొత్తాన్ని కూడా కొత్త జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే చెల్లించాలని తెలిసింది. దీంతో మొత్తంగా కొత్త జియోఫోన్‌ ధర 501 రూపాయల నుంచి 1095 రూపాయలకు పెరుగుతుంది.

అదనపు రూ.594 మొత్తంతో

అదనపు రూ.594 మొత్తంతో

ఈ అదనపు రూ.594 మొత్తంతో.. 99 రూపాయలతో ఆరు బ్యాక్‌-టూ-బ్యాక్‌ రీఛార్జ్‌లు పొందవచ్చు. రూ.99 ప్యాక్‌పై అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 0.5జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లను 28 రోజుల వాలిడిటీలో పొందనున్నారు.

రూ.101 విలువైన 6 జీబీ బోనస్‌ డేటా

రూ.101 విలువైన 6 జీబీ బోనస్‌ డేటా

దీంతో పాటు రూ.101 విలువైన 6 జీబీ బోనస్‌ డేటా ఓచర్‌ కూడా కస్టమర్లకు లభిస్తుంది. దీంతో మొత్తంగా 6 నెలల పాటు 90 జీబీ డేటా ప్రయోజనాలు పొందనున్నారు.

రెండు జియోఫోన్‌ ప్లాన్లు మాత్రమే

రెండు జియోఫోన్‌ ప్లాన్లు మాత్రమే

ప్రస్తుతం రెండు జియోఫోన్‌ ప్లాన్లు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయి. ఒకటి 49 రూపాయలు. రెండు 153 రూపాయలు. 153 రూపాయల ప్లాన్‌ అత్యధిక అమ్ముడుపోతున్న ప్లాన్‌.

జియోఫోన్ 2 ఫీచర్లు

జియోఫోన్ 2 ఫీచర్లు

వచ్చే నెల నుంచి జియోఫోన్ 2 మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
జియోఫోన్ 2 ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

జియోఫోన్‌ 2 విక్రయాలు

జియోఫోన్‌ 2 విక్రయాలు

కమర్షియల్‌గా ఈ కొత్త జియోఫోన్‌ 2 విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.2,999గా ముఖేష్‌ అంబానీ చెప్పారు.

Best Mobiles in India

English summary
Jio Phone Exchange Offer Terms and Conditions Reveal Buyers Must Pay Rs. 1,095 Instead of Rs. 501 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X