సైలెంట్‌గా జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలు, పూర్తి వివరాలు మీ కోసం..

Written By:

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జియో ఫీచర్ ఫోన్ అమ్మకాలు మళ్లీ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. జియో అధినేత ముఖేష్ అంబానీ ఈ ఫోన్ పై ప్రకటన చేసినప్పటినుంచి సంచలనాలు నమోదు చేస్తూ వచ్చిన ఈ ఫోన్ తొలి విడత అమ్మకాల్లోనే దుమ్మురేపింది. మొదటి సేల్ లోనే ఈ ఫోన్ ఏకంగా కొన్ని లక్షల రిజిస్ట్రేషన్లను దాటింటి. దీంతో సైటు క్రాష్ అవ్వడం ఫోన్ అమ్మకాలను క్లోజ్ చేయడం వెనువెంటనే జరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అమ్మకాలు ఎప్పుడనేది కంపెనీ ఇప్పటిదాకా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు సైలెంట్ గా జియో తన ఫోన్ అమ్మకాలను వెబ్ సైట్లో ప్రారంభించినట్లు తెలుస్తోంది.

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో వెబ్‌సైట్‌లో..

జియో వెబ్‌సైట్‌లో ఇప్పుడు జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఆ సైట్‌ను ఓపెన్ చేస్తే అందులో జియో ఫోన్ విభాగంలో గెట్ నౌ అనే ఆప్షన్ దర్శనమిస్తోంది.

జియో ఫోన్ ఫీచర్లు

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

మూడేళ్ల తరువాత..

మూడేళ్ల తరువాత ఇప్పుడు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేసే విధంగా జియో తన ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ ఫోన్ కేవలం నలుపురంగులో మాత్రమే లభిస్తోంది. ఈ ఫోన్ లో దాదాపు 23 రకాల భాషలు ఉన్నాయి. మీకు నచ్చిన భాషని ఎంపిక చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.

ఫ్రీ లోడెడ్ యాప్స్ ..

జియో ఫోన్ లో మైజియో, మ్యూజిక్, సినిమా, జియో టివి, జియో మని, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ లాంటి ఫ్రీ లోడెడ్ యాప్స్ ఉన్నాయి. వీటిని మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. ఇందులో ఓ ఎమర్జెన్సీ బటన్ ఉంది. మీరు జియో ఫోన్ నుంచి 5 బటన్ ట్యాప్ చేయడం ద్వారా 100, 108లాంటి వాటికి కాల్ వెళుతుంది.

రూ.153 ప్లాన్ అప్ గ్రేడ్..

కాగా ఈ రెండు రోజుల క్రితం జియో ఫోన్ రూ.153 ప్లాన్ అప్ గ్రేడ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ 4జీ హై స్పీడ్‌ డేటాతో పాటు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌(లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని జియో యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు తెలిపింది.

అంతకుముందు

రిలయన్స్‌ జియో అప్‌గ్రేడ్‌ చేసిన రూ.153 ప్యాక్‌ కింద అంతకుముందు రోజుకు 500 ఎంబీ 4జీ హైస్పీడ్‌ డేటా మాత్రమే లభ్యమయ్యేది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌(లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభించేవి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
jio 1500 Phone Booking Started – JIO Mobile Online Registration (4G LYF) Order Now
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot