Jio Diwali Offer 2024 జియో దీపావళి ధమాకా ఆఫర్.. రూ.699 కే 4G ఫోన్.. ఆఫర్ కొన్నిరోజులపాటు మాత్రమే..!
దీపావళి సందర్భంగా జియో వరుస ఆఫర్‌లను ప్రకటన చేస్తోంది. దీపావళీ ధమాకా పేరుతో (jio Diwali Dhamaka 2024) ఇప్పటికే ఎయిర్‌ఫైబర్ సహా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై రూ.3350 విలువైన కూపన్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే తాజాగా జియో ఫీచర్ ఫోన్‌లను రూ.699 ప్రారంభ ధరకే అందిస్తున్నట్లు ప్రటన చేసింది. జియోభారత్ దీపావళి ధమాకా పేరుతో జియోభారత్ 4G ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
రూ.699 కే జియో 4G ఫోన్ :
జియో దీపావళి ఆఫర్‌లో (JioBharat Diwali Dhamaka Offer 2024) భాగంగా రూ.999 విలువ చేసే జియోభారత్ 4G ఫీచర్ ఫోన్ ను రూ.699 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలంపాటు మాత్రమే ఉంటుందని జియో వెల్లడించింది. జియో వెబ్‌సైట్ ఆధారంగా ప్రస్తుతం రూ.999 ధరకు K1 కార్బన్, జియోభారత్ V2 ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

రూ.123 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ :
జియో వెబ్‌సైట్, జియోమార్ట్ మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ జియో 4G ఫీచర్ ఫోన్‌లకు రూ.123 తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా 28 వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 0.5GB డేటాను వినియోగించుకోవచ్చు.
అంటే ప్లాన్‌లో మొత్తంగా 14GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో సినిమా యాప్‌తోపాటు 455 పైగా లైవ్ టీవీ యాక్సెస్ లభిస్తుంది. జియోఛాట్ ద్వారా మెసేజ్‌లతోపాటు ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు. డిజిటల్ చెల్లింపులు, QR కోడ్ స్కాన్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.

జియోభారత్ కొత్త ఫోన్‌లు :
భారత్ మార్కెట్‌లో ఇటీవలే జియోభారత్ V3 మరియు V4 4G ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లు 1000mAh బ్యాటరీతో పనిచేయనున్నాయి. మరియు 23 భారతీయ భాషలను సపోర్టు చేస్తాయి. జియోటీవీ యాప్ ద్వారా 455 లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించవచ్చు.
ఈ ఫోన్‌లు జియోపే యాప్ ద్వారా UPI పేమెంట్‌లు చేసేందుకు వీలుంటుంది. మరియు పేమెంట్ గురించి తెలిసేలా ఇన్‌బిల్ట్ సౌండ్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. మరియు జియోఛాట్ యాప్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ మెసెజ్, ఫోటో షేరింగ్, గ్రూప్ మెసేజింగ్ ఆప్షన్‌లను పొందవచ్చు. ఈ ఫోన్‌ల ధర రూ.1099 గా ఉంది.
దీపావళీ ధమాకా 2024 ఆఫర్‌లో భాగంగా రూ.899, రూ.3599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో రూ.3350 విలువైన వోచర్‌లను పొందవచ్చని జియో తెలిపింది. నవంబర్ 5 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. రూ.899 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ, రూ.3599 ప్లాన్‌తో సంవత్సరం పాటు వ్యాలిడిటీని పొందవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తంగా రూ.3350 విలువైన వోచర్‌లను పొందవచ్చు. రూ.3000 విలువైన Easemytrip హోటళ్లు, ఎయిర్ ట్రావెల్ వోచర్‌లు సహా రూ.200 విలువైన Ajio వోచర్‌ను పొందవచ్చు. అయితే రూ.999 కంటే ఎక్కువ కొనుగోళ్లపై మాత్రమే ఈ వోచర్‌ను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు రూ.150 Swiggy వోచర్ కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








