ధర రూ.699 కే జియో 4G ఫీచర్ ఫోన్.. ఎన్ని ఫీచర్‌లు ఉన్నాయో తెలుసా?
జియో ఇప్పటికే భారత్ మార్కెట్లోకి అనేక ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. 2G కస్టమర్‌లను 4G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అయ్యే విధంగా 4G సపోర్టుతో ఫీచర్ ఫోన్‌లను తీసుకువస్తున్నట్లు విడుదల సమయంలో జియో వెల్లడించింది. ఇప్పటికీ 2G నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న లేదా ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారికి తక్కువ ధరలో 4G సదుపాయాన్ని అందించేందుకు ఈ ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు గతంలోనే జియో వెల్లడించింది.
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో జియోభారత్ K1 కార్బన్ 4G ఫీచర్ (JioBharat K1 Karbonn 4G) ఫోన్‌ను రూ.699 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 4G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది. మరియు జియోపే ద్వారా UPI పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

భారత్ మార్కెట్‌లో విడుదల సమయంలో జియోభారత్ K1 కార్బన్ 4G ఫోన్ ధర రూ.999 గా ఉండేది. దేశీయ మొబైల్స్ ఫోన్‌ల తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్‌ను గతంలో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ.699 కే అందుబాటులో ఉంది.
జియోభారత్ K1 కార్బన్ 4G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
జియో 4G ఫీచర్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ 1.77 అంగుళాల కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మైక్రో SD కార్డును సపోర్టు చేస్తుంది. 128GB స్టోరేజీ వరకు సపోర్టు చేస్తుంది.
జియోభారత్ K1 కార్బన్ 4G ఫోన్ ఈ ఫోన్ వెనుక వైపు డిజిటల్ కెమెరాను సపోర్టు చేస్తుంది. మరియు 1000mAh బ్యాటరీని కలిగి ఉంది. 23 భారతీయ భాషలకు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ప్రస్తుతానికి బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఈ ఫోన్ జియో సినిమా, జియోపే వంటి యాప్స్‌లను కూడా సపోర్టు చేస్తుంది. జియోపే యాప్ ద్వారా QR కోడ్‌లను స్కాన్ చేయవచ్చు. దీంతో సులభంగా UPI పేమెంట్లు చేయవచ్చు. జియోభారత్ ఫోన్‌ల కోసం జియో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
జియో రూ.121 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 0.5 GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 14GB డేటాను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు జియోభారత్ 4G ఫోన్ యూజర్‌లు జియోసినిమా, జియోటీవీ వంటి అదనపు యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీని అందించేలా మరో రీఛార్జ్ ప్లాన్‌ను కూడా జియో అందుబాటులోకి తీసుకొచ్చింది.
జియో రూ.234 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. మొత్తంగా 28GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియోపే యాప్‌లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.1,234 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్‌ను సదుపాయాన్ని పొందవచ్చు. 0.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో మొత్తంగా 168GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్రతి 28 రోజులకు 300 SMS లను పొందవచ్చు. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ, జియో పే వంటి యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








