5 నిమిషాలకే ఎర్రర్ మెసేజ్, జియో కొత్త అప్‌డేట్ ఏంటీ ?

టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు చెందిన జియో ఫోన్ 2 కు వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది.

|

టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు చెందిన జియో ఫోన్ 2 కు వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ ఫోన్‌కు గాను మొదటి ఫ్లాష్ సేల్‌ 5 నిమిషాల్లోనే ముగిసిపోయి వినియోగదారులకు పేజ్ అండర్ మెయింటెనెన్స్ అనే ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది. కాగా నేడు జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. ఇక జియో ఫోన్ 2 కు గాను తరువాతి సేల్‌ను ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు జియో అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఫోన్ ధర రూ.2,999 గా ఉంది. ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

 

రూ. 500కే జియో ఫైబర్ ప్లాన్, బుకింగ్ ఎలా,ఎప్పుడు,పూర్తి వివరాలు మీకోసంరూ. 500కే జియో ఫైబర్ ప్లాన్, బుకింగ్ ఎలా,ఎప్పుడు,పూర్తి వివరాలు మీకోసం

జియోఫోన్‌ 2 ఫీచర్లు

జియోఫోన్‌ 2 ఫీచర్లు

2.4 అంగుళాల హారిజంటల్ డిస్‌ప్లే‌తో పాటు క్వర్టీ కీప్యాడ్, జీపీఎస్‌, ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సప్,512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమరీ కార్డుతో 128 జీబీ వరకు),2000ఎంఏహెచ్ బ్యాటరీ,వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా,ముందు భాగంలో వీజీఏ సెల్ఫీ కెమెరా,4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై

జియో ఫోన్‌తో పోలిస్తే..

జియో ఫోన్‌తో పోలిస్తే..

ఈ ఫోన్‌లో పాత జియో ఫోన్‌తో పోలిస్తే పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఫోన్ డిస్‌ప్లేతోపాటు ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2 లో అందిస్తున్నారు.

రూ. 501కు కొత్త జియో ఫోన్‌‌
 

రూ. 501కు కొత్త జియో ఫోన్‌‌

ఇదిలా ఉంటే పాత తమ పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చి రూ. 501కు కొత్త జియో ఫోన్‌‌ను పొందవచ్చు. అలాగే జియోఫోన్‌ లో కొత్తగా లేటెస్ట్‌ ఫీచర్లను జతచేశారు.

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌

ఆగస్టు 15 నుంచి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌ను జియోఫోన్‌ కస్టమర్లు పొందుతున్నారు.వాట్సప్‌ కూడా బ్యాచ్‌ వారీగా అందుబాటులోకి వస్తుంది.

జియోటీవీ, జియోసినిమా

జియోటీవీ, జియోసినిమా

జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్‌, జియోఛాట్‌ అప్లికేషన్ల ప్రీమియం కంటెంట్‌ను పొందడంతో పాటు, ఉచిత వాయిస్‌ కాల్స్‌ కూడా పొందుతారు.

వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌

వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌

వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ ద్వారా కాల్స్‌ చేసుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం, ఇంటర్నెట్‌ సెర్చ్‌ చేసుకోవడం, మ్యూజిక్‌ ప్లే చేయడం, వీడియోలు చూడటం వంటివి చేసుకోవచ్చు.

ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను

ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను

ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్‌ఫర్మేషన్‌, ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను పొందవచ్చు.

డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు

డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు

భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు జియోఫోన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రతి ఒక్క భారతీయుడికి ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను కల్పించి, డిజిటల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేసే అవకాశం కల్పించనున్నామని జియోఫోన్‌ 2ను అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్‌ జియో ప్రకటన చేసింది.

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ

ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

Best Mobiles in India

English summary
Reliance Jio JioPhone 2 Flash Sale: Price, Facebook, YouTube, WhatsApp Features more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X