జియోఫీచర్ ఫోన్‌కి పోటీగా నోకియా 4జీ ఫోన్ !

By Hazarath
|

దేశీయ టెలికారం రంగంలో దూసుకుపోతున్న జియో తన ఫీచర్ ఫోన్ ని మార్కెట్లోకి రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్‌కి పోటీగా అనేక కంపెనీలు అత్యంత తక్కువ ధరకే తమ 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా జియోకి పోటీగా ఇప్పుడు నోకియా తన ఫీచర్ ఫోన్ నోకియా 3310ని రంగంలోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

 

3జీలో నోకియా 3310, ధర చూస్తే బేజారే, ఇండియాకి షాక్ !3జీలో నోకియా 3310, ధర చూస్తే బేజారే, ఇండియాకి షాక్ !

 4జీ ఫోన్ కింద మార్కెట్లోకి ..

4జీ ఫోన్ కింద మార్కెట్లోకి ..

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ అతి త్వరలో తన నోకియా 3310కి తుది మెరుగులు అద్ది 4జీ ఫోన్ కింద మార్కెట్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో లీకయ్యాయి

ఈ ఏడాది ఆరంభంలో..

ఈ ఏడాది ఆరంభంలో..

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 3310 ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే.

త్వరలో 4జీ వేరియెంట్‌

త్వరలో 4జీ వేరియెంట్‌

అయితే ఇందులో 2జీ సపోర్ట్ మాత్రమే ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఇదే ఫోన్‌కు చెందిన 3జీ వేరియెంట్‌ను లాంచ్ చేశారు. అయితే త్వరలో ఇదే నోకియా 3310 ఫీచర్ ఫోన్‌కు గాను 4జీ వేరియెంట్‌ను విడుదల చేయనున్నారు.

ఆండ్రాయిడ్ ఆధారిత యున్ ఓఎస్‌..
 

ఆండ్రాయిడ్ ఆధారిత యున్ ఓఎస్‌..

2జీ వేరియెంట్‌లో నోకియా సిరీస్ 30 ప్లస్ ఓఎస్ ఉండగా, 3జీ వేరియెంట్‌లో జావా ఆధారిత ఫీచర్ ఓఎస్‌ను ఇచ్చారు. ఇక నోకియా 3310 4జీ వేరియెంట్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత యున్ ఓఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా..

2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా..

కాగా త్వరలో రానున్న నోకియా 3310 4జీ ఫీచర్ ఫోన్‌లో 2.4 ఇంచ్ కలర్ డిస్‌ప్లే, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, ఫ్లాష్ లైట్, బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, డ్యుయల్ సిమ్, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతోపాటు జీ వీవోఎల్‌టీఈని అందించున్నారు.

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌

కాగా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను, ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. కాగా అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ధర

ధర

కాగా నోకియా 3310 ధర మార్కెట్లో రూ. 3,300గా ఉంది. మరి ఈ ధరకు అటూ ఇటూగా 4జీ ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
JioPhone effect: Nokia may soon foray into 4G feature phone market in India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X