Spreadtrum ఇప్పుడు UNISOC, ఫీచర్ ఫోన్‌లలోనూ 4జీ సపోర్ట్..

రిలయన్స్ బ్రాండ్ నుంచి భారత్‌లో విడుదలైన జియోఫోన్, జియోఫోన్ 2 4జీ ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సంపదించుకున్నాయో మనందరికి తెలుసు

|

రిలయన్స్ బ్రాండ్ నుంచి భారత్‌లో విడుదలైన జియోఫోన్, జియోఫోన్ 2 4జీ ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లో ఎంతటి పాపులారిటీని సంపదించుకున్నాయో మనందరికి తెలుసు. 4జీ మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఈ జియోఫోన్లను ఓ శక్తి వెనుక నుంచి ఓ శక్తి నడిపిస్తోంది. అదే UNISOC. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ తయారీదారు గతంలో Spreadtrum పేరుతో ఆపరేషన్స్ నిర్వహించేంది.

 

వాట్సాప్ నుంచి మరో అద్భుత ఫీచర్వాట్సాప్ నుంచి మరో అద్భుత ఫీచర్

ఎక్కువ రివెన్యూ జియో ఫోన్‌ల నుంచే..

ఎక్కువ రివెన్యూ జియో ఫోన్‌ల నుంచే..

జియోఫోన్‌లలో ఈ సంస్థ తయారుచేసిన మొబైల్ చిప్‌లనే ఎక్విప్ చేస్తున్నారు. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం UNISOC సంస్థకు ప్రధాన రివెన్యూ జియో ఫోన్‌ల నుంచే వస్తోందట. ఈ నేపథ్యంలో దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలైన మైక్రోమాక్స్, లావాలతో కూడా UNISOC సంప్రదింపులు జరుపుతోందట.

 

 

బేసిక్ ఫోన్‌లు సైతం 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేసేందుకు వీలుగా..

బేసిక్ ఫోన్‌లు సైతం 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేసేందుకు వీలుగా..

జియోతో పాటు మైక్రోమాక్స్, లావాలతో ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా రివెన్యూ శాతాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. బేసిక్ మొబైల్ ఫోన్‌లు సైతం 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేసేందుకు వీలుగా UNISOC సంస్థ మొబైల్ చిప్‌సెట్‌లను అభివృద్థి చేస్తోంది. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేయగలుగుతుంది. తద్వారా జియోఫోన్ వంటి ఎంట్రీలెవల్ మొబైల్ ఫోన్‌లు సైతం వైగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీని ఆఫర్ చేయగలుగుతున్నాయి.

 

 

జియోఫోన్‌లలో అన్ని రకాల ఫీచర్లు..
 

జియోఫోన్‌లలో అన్ని రకాల ఫీచర్లు..

భారత్‌లో నెలకున్న పోటీ మార్కెట్ నేపథ్యంలో లావా, మైక్రోమాక్స్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్-ఫ్రెండ్లీ ధరల్లో ఎంట్రీ లెవల్ 4జీ ఫోన్‌లను తీసుకువస్తున్నప్పటికి వీటిలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. ఇదే సమయంలో UNISOC చిప్‌సెట్‌లతో వస్తోన్న జియోఫోన్‌లలో అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి.

 

 

నెలకు 70 లక్షల చొప్పున ఫోన్‌లు..

నెలకు 70 లక్షల చొప్పున ఫోన్‌లు..

తాజాగా రివీల్ అయిన మరో రిపోర్ట్ ప్రకారం ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 4 కోట్ల జియో ఫోన్ యూనిట్లను విక్రయించగలిగింది. గడిచిన మూడు నెలలుగా, నెలకు 70 లక్షల చొప్పున ఫోన్‌లను ఈ బ్రాండ్ విక్రయించగలుగుతోందట.

 

 

QWERTY కీప్యాడ్‌ మార్కెట్‌ను షేక్ చేస్తోన్న జియోఫోన్ 2

QWERTY కీప్యాడ్‌ మార్కెట్‌ను షేక్ చేస్తోన్న జియోఫోన్ 2

రిలయన్స్ జియో తన మొట్టమొదటి జియో ఫోన్‌ను 2017లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు మంచి స్పందన లభించటంతో 2018 ఆగష్టులో జియోఫోన్ 2ను అందుబాటులోకి తీసుకువచ్చింది. QWERTY కీప్యాడ్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది.

 

 

UNISOC 9863 సాక్‌తో మైక్రోమాక్స్, లావా స్మార్ట్‌ఫోన్‌లు

UNISOC 9863 సాక్‌తో మైక్రోమాక్స్, లావా స్మార్ట్‌ఫోన్‌లు

జియో ఫోన్లలో ఎక్విప్ అయి ఉన్న యునిసాక్ మ్యూజిక్ ఇంకా స్ట్రీమింగ్ సర్వీసులతో పాటు వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ వంటి ప్రముఖ యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. UNISOC సంస్థ మైక్రోమాక్స్, లావాలతో కదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో, ఈ రెండు బ్రాండ్‌ల నుంచి త్వరలో లాంచ్ అయ్యే ఫోన్‌లు UNISOC 9863 అనే సాక్ పై రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
JioPhone Major Source of Revenue for UNISOC, in Talks With Lava and Micromax to Bring Cheap 4G Smartphones.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X