జియోఫోన్ వాట్సాప్‌ను సపోర్ట్ చేస్తుంది!

కొద్ది రోజుల క్రితం మార్కెట్లో అనౌన్స్ అయిన రిలయన్స్ జియోఫోన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చేతుల మీదగా లాంచ్ అయిన ఈ ఫోన్ పై ఇప్పటికే అనేక కథనాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Read More : మన శాస్త్రవేత్తలు, వారి సంచలనాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్‌ను సపోర్ట్ చేయటం లేదంటూ కొన్ని రిపోర్ట్స్

జియోఫోన్‌లో వాట్సాప్‌ మెసేజింగ్ సర్వీస్ పనిచేయదన్న వార్త  ఇప్పటికే ఇంటర్నెట్‌లో హోరెత్తుతోంది. అయితే, వాట్సాప్‌ మెసేజింగ్ సర్వీసును జియోఫోన్ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నదాని పై ఇప్పటివరకు ఏ విధమైన అఫీషియల్ న్యూస్ అందుబాటులో లేదు.

ఫ్యాక్టరీ డైలీ రిపోర్ట్స్ ప్రకారం..

తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం జియోఫోన్స్ పై వర్క్ అయ్యే విధంగా ఓ స్పెషల్ వర్షన్ వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ను ఇంజినీర్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ డైలీ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం జియోఫోన్‌లను సపోర్ట్ చేసే విధంగా కోసం కొత్త వర్షన్‌ వాట్సాప్ మెసేజింగ్ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్

జియో‌ఫోన్‌లో జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

ఆగష్టు 24 నుంచి ప్రీ-బుకింగ్స్..

జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు ఆగష్టు 24న MyJio appను ఓపెన్ చేసినట్లయితే ఫోన్‌ను బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈలోపే https://www.jio.com వెబ్‌సైట్‌లోకి లాగినై Keep Me Posted అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలను ఫిల్ చేసినట్లయితే ఫోన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని వ్యక్తిగత యూజర్లకే కాకుండా వ్యాపారస్తులకు కూడా జియో కల్పిస్తోంది. జియోఫోన్ లను బుక్ చేసుకునే బిజినెస్ ఓనర్స్ పాన్ లేదా GSTN నెంబర్ ను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. వీళ్లు 50 కూడా ఎక్కువ ఫోన్‌లను ఆర్డర్ చేసే వీలుంటుంది.

జియోఫోన్ స్పెసిఫికేషన్స్

2.4 అంగుళాల డిస్‌ప్లే, KAI OS, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్ తో సహా షేర్ చేయబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
JioPhone may run special version of WhatsApp. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot