సాయంత్రం 5 గంటల నుంచి జియోఫోన్ బుకింగ్స్ ప్రారంభం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిలయన్స్ JioPhone ప్రీ-బుకింగ్స్, ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసే క్రమంలో ముందుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.

Read More : ఫోన్ స్ర్కీన్ మారుస్తున్నారా? జాగ్రత్త, మీ ఫోన్‌ను హ్యాక్ చేసేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకునే వారు

ఆఫ్‌లైన్ ద్వారా ఈ JioPhoneలను బుక్ చేసుకోవాలనుకునే వారు తమకు సమీపంలోని జియో స్టోర్‌లకు వెళ్లి ఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు MyJio appలోకి వెళ్లి జియోఫోన్‌ను ఆర్డర్ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు

MyJio appను ఓపెన్ చేసినట్లయితే ఫోన్‌ను బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈలోపే మీరు https://www.jio.com వెబ్‌సైట్‌లోకి లాగినై Keep Me Posted అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలను ఫిల్ చేసినట్లయితే ఫోన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందుతాయి.

ప్రతి ఒక్కరికి ఉచితంగా..

జియోఫోన్‌ ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు. జియోఫోన్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టంబర్ నుంచి ఫోన్ల‌ను డెలివరీ చేస్తారు.

రూ.153 బేస్ ప్యాక్..

జియోఫోన్ యూజర్లు కోసం రూ.153 బేస్ ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. జియోఫోన్ యూజర్లు నెలకు రూ.153 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఈ ఫోన్‌తో ఇన్‌‌బిల్ట్‌గా వస్తోన్న జియో యాప్స్ ద్వారా మ్యూజిక్, సినిమా, లైవ్ టీవీ ఇలా అనేక సదుపాయాలను ఆస్వాదించే వీలుంటుంది.

రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్స్..

రూ.153 బేస్ ప్యాక్‌తో పాటు రూ.24, రూ.54 జియో సాచెట్ ప్యాక్‌లను కూడా అంబానీ లాంచ్ చేసారు. రూ.24 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో, రూ.54 ప్యాక్ 7 రోజుల వ్యాలిడిటీతో లభిస్తాయి.

జియో ఫోన్ ఫీచర్స్ అలానే స్సెసిఫికేషన్స్..

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ Snapdragon 205 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. రెండవ వేరియంట్ Spreadtrum చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, వాయిస్ కమాండ్స్‌తో పాటు 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్, ప్రీ-ఇన్‌స్టాల్డ్ జియో యాప్ సూట్, 400 లైవ్ టీవీ ఛానల్స్ సదుపాయం. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అలానే సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్ సదుపాయం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
JioPhone Pre-Booking Opens on August 24 – 5pm amidst high demand. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot