4G కనెక్టివిటీ, UPI, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్టుతో JioPhone Prima 2 విడుదల.. అమెజాన్‌లో సేల్..!
జియో సంస్థ భారత్ లో మరో ఫీచర్ ఫోన్ JioPhone Prima 2 ను విడుదల చేసింది. గత సంవత్సరం నవంబర్‌లో విడుదల చేసిన జియోఫోన్ Prima 4G ఫోన్‌ను తర్వాత తరం హ్యాండ్‌సెట్ గా అందుబాటులోకి వచ్చింది. గత మోడల్ తరహాలోనే ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉండగా.. మరిన్ని అప్‌గ్రేడ్ ఫీచర్‌లతో లాంచ్ అయింది. కర్వడ్ స్క్రీన్ సహా వెనుక, ముందు వైపు కెమెరాలను అమర్చారు.
జియోఫోన్ Prima 2 ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు :
ఈ జియో ఫీచర్ ఫోన్ 2.4 అంగుళాల కర్వడ్ డిస్‌ప్లే, కీ ప్యాడ్‌తో విడుదల అయింది. ఈ ఫోన్ KaiOS 2.5.3 OS, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 128GB వరకు పొడిగించుకొనే అవకాశం ఉంది.

23 భాషలను సపోర్టు చేస్తుంది :
ఈ జియో కొత్త ఫీచర్ ఫోన్ జియోటీవీ, జియోసినిమా, జియోSaavan వంటి యాప్‌లను సపోర్టు చేయనుంది. UPI పేమెంట్ల కోసం ఈ హ్యాండ్‌సెట్ JioPay ను సపోర్టు చేయనుంది. దీంతోపాటు ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ ను కూడా సపోర్టు చేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 23 భాషలను సపోర్టు చేస్తుందని జియో తెలిపింది.
LED టార్చ్ లైట్ :
కెమెరా విభాగం పరంగా ఈ జియోఫోన్ Prima 2 ముందు, వెనుకవైపు కెమెరాలను కలిగి ఉంటుంది. సంస్థ అందించిన వివరాల ఆధారంగా ఎటువంటి యాప్‌లు అవసరం లేకుండా ఈ ఫోన్ డైరెక్ట్ వీడియో కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు LED టార్చ్‌లైట్‌ను కూడా కలిగి ఉంటుంది.

2000mAh బ్యాటరీ :
బ్యాటరీ విషయానికి వస్తే ఈ జియోఫోన్ Prima 2 ఫోన్ 2000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సింగిల్ నానో సిమ్‌తో 4G కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. FM రేడియో ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. 3.5mm ఆడియో జాక్, ఈ హ్యాండ్‌సెట్ బరువు 120 గ్రాములుగా ఉంది. మరియు లెదర్ తరహా ఫినిష్‌ను కలిగి ఉంది.
జియోఫోన్ Prima 2 ధర, సేల్ వివరాలు :
జియోఫోన్ Prima 2 ఫీచర్ ఫోన్ ధర రూ.2,799 గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. లక్స్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. అయితే మొత్తంగా 4G కనెక్టివిటీ సపోర్టుతో మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఈ హ్యాండ్ సెట్ కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








