ఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లు

|

ఫీచర్ ఫోన్ల రంగంలో సవాల్ విసురుతూ ముందుకు వెళుతున్న జియోఫోన్ ఏకంగా ఆండ్రాయిడ్ ఫోన్లపైనే గురి పెట్టింది. గూగుల్ పాపులర్ ఫీచర్లు ఈ ఫోన్‌కి అతి త్వరలో అందుబాటులో రానున్నాయి. గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ మ్యాప్స్‌, యూట్యూబ్‌, గూగుల్‌ సెర్చ్‌లను జియో ఫోన్‌లో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జియో ఫీచర్‌ ఫోన్‌ ప్రస్తుతం అమెరికా కంపెనీ కిఓఎస్‌ టెక్నాలజీస్‌కు చెందిన కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. గూగుల్ సహకారంతో కేఏఐ ఓఎస్ కు సపోర్ట్ చేసే విధంగా యాప్స్ ను రూపొందించారు.

 

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

పాపులర్‌ గూగుల్‌ సర్వీసులు

పాపులర్‌ గూగుల్‌ సర్వీసులు

గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కిఓఎస్‌ ఈ యాప్స్‌ను త్వరలో తన యూజర్లకు అందించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా పాపులర్‌ గూగుల్‌ సర్వీసులు త్వరలో రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్‌, జియోఫోన్‌లోకి రాబోతున్నాయి.

 22 మిలియన్ డాలర్ల నిధులను..

22 మిలియన్ డాలర్ల నిధులను..

ఇంటర్నెట్ ను మరింత మందికి చేరువ చేయాలన్న సంకల్పంలో భాగంగా గూగుల్ 22 మిలియన్ డాలర్ల నిధులను కూడా కేఏఐ ఓఎస్ టెక్నాలజీస్ కు అందించింది.

కేఏఐఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఫోన్లను

కేఏఐఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఫోన్లను

ఈ నిధులతో కేఏఐఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు వీలవుతుందని ఆ సంస్థ సీఈవో సెబాస్టియన్ కోడెవిల్లే తెలిపారు.

 ఫాస్ట్‌-ట్రాక్‌ అభివృద్ధికి..
 

ఫాస్ట్‌-ట్రాక్‌ అభివృద్ధికి..

గూగుల్‌ నుంచి వచ్చిన ఈ నిధులను ఫాస్ట్‌-ట్రాక్‌ అభివృద్ధికి ఉపయోగిస్తామని, కిఓఎస్‌ ఆధారంగా రూపొందిన స్మార్ట్‌ ఫీచర్‌ఫోన్లను గ్లోబల్‌గా అందిస్తామని కిఓఎస్‌ చెప్పింది. ముఖ్యంగా ఇంటర్నెట్‌ లేని ఎమర్జింగ్‌ మార్కెట్లలో వీటిని ఉపయోగిస్తామని కిఓఎస్‌ టెక్నాలజీస్‌ సీఈవో సెబాస్టియన్‌ చెప్పారు.

పలు పాపులర్‌ యాప్స్‌ను..

పలు పాపులర్‌ యాప్స్‌ను..

జియోఫోన్లు విజయవంతం కావడంతో, గూగుల్‌కు చెందిన పలు పాపులర్‌ యాప్స్‌ను ఈ యూజర్లకు అందించాలని కిఓఎస్‌ నిర్ణయించినట్టు తెలిసింది.

ఆపిల్‌ ఓఎస్‌ను బీట్‌ను చేసి..

ఆపిల్‌ ఓఎస్‌ను బీట్‌ను చేసి..

కిఓఎస్‌ అనేది వెబ్‌ ఆధారిత ప్లాట్‌పామ్‌. జియోఫోన్‌కు వెల్లువెత్తిన భారీ డిమాండ్‌తో ఈ ఓఎస్‌ మొబైల్‌ ఓఎస్‌ మార్కెట్‌లో ఆపిల్‌ ఓఎస్‌ను బీట్‌ను చేసి మరీ 15 శాతం లాభాలను ఆర్జించింది.

జియో ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

జియో ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు

ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు

అనుమానాలన్నీ పటాపంచల్అనుమానాలన్నీ పటాపంచల్

Best Mobiles in India

English summary
JioPhone users may soon get these popular Google features More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X