ఏది బెటర్, జియో ఫోన్ vsఇంటెక్స్ టర్బో 4G+vsఐడియా రూ.2500 ఫోన్ !

ఉచితంగా జియో ఫోన్ అంటూ ముఖేష్ అంబాని మార్కెట్లో ప్రకంపనలు పుట్టించిన నేపథ్యంలో జియో ఫోన్ కు ధీటుగా అన్ని కంపెనీలు తక్కువ ధరలకే ఫోన్లను అందించే పనిలో పడ్డాయి.

By Hazarath
|

ఉచితంగా జియో ఫోన్ అంటూ ముఖేష్ అంబాని మార్కెట్లో ప్రకంపనలు పుట్టించిన నేపథ్యంలో జియో ఫోన్ కు ధీటుగా అన్ని కంపెనీలు తక్కువ ధరలకే ఫోన్లను అందించే పనిలో పడ్డాయి. ఈ వరసలో ఇంటెక్స్ కంపెనీ తన చీప్ ఫోన్ ను మార్కెట్లోకి వదిలింది. ఐడియా కూడా 2500కే సరికొత్త 4జీ ఫోన్ ను అందిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వాటి ఫీచర్లు ఏదీ తక్కువధరకు సొంతం చేసుకోవచ్చనే విషయాలు తెలుసుకోవాలనని చాలా మందికి ఉంటుంది. వాటి వివరాలను మీకందిస్తున్నాం ఓ లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ రేంజ్‌లో వస్తోందా..? లీకయిన స్పెషిఫికేషన్లు !శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ రేంజ్‌లో వస్తోందా..? లీకయిన స్పెషిఫికేషన్లు !

జియో ఫోన్

జియో ఫోన్

ముఖేష్ అంబాని ఈ ఫోన్ ఉచితం అని చెప్పినప్పటికీ రూ. 1500 కడితేనే ఈ ఫోన్ మీ సొంతమవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈ మొత్తాన్ని కడితే తిరిగి 3 సంవత్సరాల తరువాత మీకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. దీంతో పాటు మీరు 153తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫోన్ మొత్తం విలువ రూ. 1653

జియో ఫోన్ ఫీచర్లు

జియో ఫోన్ ఫీచర్లు

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

ఇంటెక్స్ టర్బో 4G+

ఇంటెక్స్ టర్బో 4G+

ప్రస్తుతం నడుస్తున్నదంతా 4జీ యుగం. అందులోనూ జియో రాకతో 4జీ వీవోఎల్‌టీఈ ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే లావా, రిలయన్స్ జియోలు తమ 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేయగా, తాజాగా అదే బాటలో ఇంటెక్స్ టర్బో ప్లస్ 4జీ పేరిట ఓ నూతన 4జీ వీవోఎల్‌టీఈ ఫోన్‌ను విడుదల చేసింది. రూ.1500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు వచ్చే దీపావళి నుంచి అందుబాటులోకి రానుంది.

ఇంటెక్స్ టర్బో ప్లస్ 4జీ ఫీచర్లు

ఇంటెక్స్ టర్బో ప్లస్ 4జీ ఫీచర్లు

2.4 ఇంచ్ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, కాయ్ (Kai) ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, టార్చి లైట్, 4జీ వీవోఎల్‌టీఈ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐడియా ఫోన్

ఐడియా ఫోన్

రిలయన్స్ జియో అనౌన్స్ చేసిన జియో‌ఫోన్‌కు పోటీగా ఐడియా సెల్యులార్ ఓ 4జీ మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ధర రూ.2,500 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. జియో‌ఫోన్‌ తరహాలోనే ఈ ఐడియా 4జీ ఫోన్‌లో కూడా స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లు ఉంటాయా?, ఉండవా? అన్నది తెలియాల్సి ఉంది.

ఐడియా ఫోన్ ఫీచర్లు

ఐడియా ఫోన్ ఫీచర్లు

ఈ ఫోన్ డ్యూయెల్ సిమ్ తో రానుందని సమాచారం. ఒక సిమ్ 2జికి మరో సిమ్ 4జికి సపోర్ట్ చేసే విధంగా ఉంటుందని ఐడియా చెబుతోంది.సరికొత్త అప్లికేషన్లతో యూజర్లను ఆకట్టుకునే విధంగా ఈ ఫోన్ రానుందని అప్పుడే టెక్ వర్గాలు అంచనాకు వచ్చాయి.

3 ఫోన్లను పోల్చి చూస్తే

3 ఫోన్లను పోల్చి చూస్తే

జియో ఫోన్ ధర మొత్తంగా 1653 రూపాయలు, ఇంటెక్స్ టర్బో ధర రూ. 1999, కాగా ఐడియా ఫోన్ ధర రూ. 2500. ఇందులో జియో ఫోన్ కేవలలం జియో సిమ్ కే సపోర్ట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటెక్స్ టర్బోలో ఏ సిమ్ అయినా పనిచేస్తుంది. ఐడియాఫోన్ లో అన్ని సిమ్ లు పనిచేస్తాయా లేక ఐడియా సిమ్ మాత్రమే పనిచేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
JioPhone vs Intex Turbo 4G + vs Idea-Vodafone's planned Rs 2500 4G phone: Worth the deal?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X