రూ.699కే జియో నుంచి మరో ఫోన్, ఈ సారి కొత్త కండీషన్లతో !

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనంతో దూసుకొచ్చింది. జియోఫోన్‌తో సంచలనాలను సృష్టించిన జియో అత్యంత తక్కువ ధరలో మరో ఫోన్ ని అందించేందుకు రెడీ అయింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న 4జీ ఫోన్ ధర కేవలం రూ.699 మాత్రమే. జీవీ మొబైల్స్ సంస్థతో భాగస్వామ్యం అయిన జియో ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నది. జీవీ మొబైల్స్‌కు చెందిన ఎనర్జీ ఈ3 స్మార్ట్‌ఫోన్‌ను కొన్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో రూ.2,899 ధరకు లభిస్తోంది.

ఐడియా సైలెంట్ ఆఫర్,రూ.109కే అపరిమిత కాల్స్, 1జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అదే ధరతో ముందుగా..

కాగా ఈ ఫోన్ అదే ధరతో ముందుగా వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌ను జియో యాప్ లేదా సైట్‌లో రీచార్జి చేసుకోవాలి. అనంతరం రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వోచర్ల రూపంలో వస్తుంది.

మొత్తం 44 వోచర్లు

ఒక్కొక్కటి రూ.50 విలువ గల మొత్తం 44 వోచర్లు యూజర్‌కు చెందిన జియో అకౌంట్‌లో ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ అవుతాయి. వీటిని తరువాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ క్రమంలో ఎనర్జీ ఈ3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.699 మాత్రమే అవుతుంది.

ఫుట్‌బాల్ ఆఫర్‌లో భాగంగా ..

జియో ఈ ఆఫర్‌ను తన ఫుట్‌బాల్ ఆఫర్‌లో భాగంగా అందిస్తుండగా, దాదాపుగా అనేక కంపెనీలకు చెందిన 4జీ ఫోన్లపై కూడా రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పైన చెప్పిన విధంగా వస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

ఇక జీవీ మొబైల్స్‌కు చెందిన ఎనర్జీ ఈ3 స్మార్ట్‌ఫోన్‌లో 4 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

మరో స్మార్ట్‌ఫోన్ ప్రైమ్ పీ444పై..

జీవీ కంపెనీకి చెందిన మరో స్మార్ట్‌ఫోన్ ప్రైమ్ పీ444పై కూడా జియో ఫుట్ బాల్ ఆఫర్ లభిస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.4,799 ఉండగా, రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పోను దీని ధర రూ.2599 అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jios New Offer: Jivi 4G Smartphone To Cost Rs. 699. Details Here More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot