రూ.1999కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

Posted By:

రూ.1999కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, నమ్మశక్యంగా లేదు కదూ!!. ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జివి మొబైల్స్ (Jivi Mobiles) తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. జివి  జెఎస్‌పి 20 పేరుతో విడుదలైన ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.1999.

రూ.1999కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

ఇ-పరిపాలన (ఇ-గవర్నెన్స్)లో భాగంగా ప్రజలు నేరుగా తమ మొబైల్ ఫోన్‌ల ద్వారానే అన్ని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రధాన మంత్రి డిజిటల్ ఇండియా విజన్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ విజన్‌కు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని, ఈ క్రమంలో 2019 నాటికి ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచాలనే లక్ష్యంతో తాము కృషిచేస్తున్నామని పంకజ్ ఆనంద్, జివి మొబైల్స్ తెలిపారు.

జెఎస్‌పి 20 ప్రధాన ఫీచర్లు:

3.5 అంగుళాల ఓజీఎస్ కెపాసిటివ్ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ (2జీ + 2జీ), ఆండ్రాయిడ్ 2.3.5 జింజ‌ర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 128ఎంబి ర్యామ్, 256 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు  విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ సపోర్ట్ తో), కనెక్టువిటీ ఫీచర్లు : 2జీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 1350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రముఖ రిటైలర్ Amazon.in ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. సెప్టంబర్ 25 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టంబర్ 24లోపు ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారు ఫ్లిప్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Jivi Launches JSP 20: India's Cheapest Android Smartphone at Rs 1,999. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot