ఎవరూ హ్యాక్ చేయలేని ఫోన్ వచ్చేస్తోంది..

ప్రపంచవ్యాప్తంగా సెక్యూరిటీ సేవలను అందిస్తోన్న ప్రముఖ యాంటీ వైరస్ కంపెనీ McAfee ఓ శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేయబోతోంది.

Read More : జూన్‌లో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, 100Mbps వేగంతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

John McAfee Privacy Phone

John McAfee Privacy Phone పేరుతో తీసుకురాబోతున్న ఈ డివైస్ ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్డ్ ఫోన్‌గా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. cybersecurity MGT సహకారంతో ఈ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు McAfee వెల్లడించింది.

ధర రూ.70,703 వరకు ఉండొచ్చు..

మార్కెట్లో ఈ ఫోన్ ధర 1100 డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రైవసీకి పెద్దపీట వేసేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది. మాల్వేర్, రాన్సమ్‌వేర్ వంటి రిస్కులను ఈ ఫోన్ ఏ మాత్రం దరిచేరనివ్వదట.

హైక్వాలిటీ సెక్యూరిటీ ఫీచర్స్..

అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫోన్‌లోని బ్యాటరీ, వై-ఫై, బ్లుటూత్ యాంటెనా, కెమెరా, మైక్రోఫోన్ ఇంకా జియో లోకేషన్‌లను ఆఫ్ చేసుకునేందుకు వెనుక భాగంలో ప్రత్యేకమైన బటన్ కూడా ఉంటుందట. మొబైల్ ఫోన్ ట్రాఫిప్ పై నిఘాపెట్టేందుకు ఉపయోగించే స్టింగ్‌రే, ఐఎమ్ఎస్ఐ క్యాచర్ వంటి డివైస్‌లను కూడా ఈ ఫోన్ అడ్డుకోగలదట.

మీ ఫోన్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే..?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లు హ్యాకింగ్ ప్రోన్‌గా మారిపోయాయి. మోస్ట్ సెక్యూర్డ్ ఫీచర్లతో, ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన గూగుల్ పిక్సల్ ఫోన్ ను సైతం చైనా బృందం 60 సెకన్లలో హ్యాక్ చేసి చూపించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి సెక్యూరిటీ స్థాయిని మరింతగా పెంచేందుకు చాలానే ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మీ స్మార్ట్ ఫోన్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా, ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

పాస్‌వర్డ్‌ లాక్‌ తప్పనిసరి..

మీ ఫోన్‌కు ఓపెన్ చేసేందకు పాస్‌వర్డ్‌ లాక్‌ను సెట్ చేసుకోండి. లాక్ చేయవల్సిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవవల్సి వచ్చినప్పటికి, మీ ఫోన్ మాత్రం సురక్షితంగా ఉంటుంది.

నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి...

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ ఎప్పటికప్పుడు చేసి ఉంచండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఇతర డివైజ్ లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.

ఎన్‌క్రిప్షన్ తప్పనిసరి..

మీ ఫోన్‌లోని డేటా ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసకోవటం ద్వారా డేటాకు పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. ఈ మధ్య లాంచ్ అవతోన్న ఆండ్రాయిడ్ పోన్ లలో ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ను డీఫాల్ట్ గానే అందిస్తున్నారు.

"https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే..

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..? అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి..

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండటం మంచింది. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
John McAfee announces the world’s most secure smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot